Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని తిట్టొద్దు… క్యాడర్ కు జగన్ వార్నింగ్

ఒకప్పుడు జగన్ ప్రసంగం అంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ని తిట్టాల్సిందే. ముఖ్యంగా పవన్ మూడు పెళ్లిళ్లు గురించి విమర్శించకుండా ఏనాడు జగన్ ప్రసంగం ముగిసేది కాదు. కార్లు మార్చినట్టు పెళ్ళాలని మారుస్తాడని, దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టార్ అని ఇలా ఒకటి కాదు చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ నే జగన్ ఎక్కువగా ఆడిపోసు కునేవారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ఎంతగా డ్యామేజ్ చేయాలో అంతా డామేజ్ చేశారు జగన్.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పల్లెత్తు మాట అనొద్దని క్యాడర్ కు, లీడర్లకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు, లోకేష్ ని ఎంతైనా విమర్శించవచ్చని. మంత్రులను, మిగిలిన టిడిపి నాయకులను ఎవర్ని వదిలి పెట్టాల్సిన అవసరం లేదని, కానీ పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళొద్దని అందరికీ మౌఖికంగా ఆదేశాలు పంపించాడు జగన్. పవన్ వ్యక్తిగత జీవితం గురించి అసలు మాట్లాడొద్దని కూడా చెప్పారట.

ఒకప్పుడు జగన్ ప్రసంగం అంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ని తిట్టాల్సిందే. ముఖ్యంగా పవన్ మూడు పెళ్లిళ్లు గురించి విమర్శించకుండా ఏనాడు జగన్ ప్రసంగం ముగిసేది కాదు. కార్లు మార్చినట్టు పెళ్ళాలని మారుస్తాడని, దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టార్ అని ఇలా ఒకటి కాదు చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ నే జగన్ ఎక్కువగా ఆడిపోసు కునేవారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ఎంతగా డ్యామేజ్ చేయాలో అంతా డామేజ్ చేశారు జగన్.

దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ వల్లే టిడిపి గెలుస్తుందని, పవన్ ఓట్ బ్యాంకు టిడిపికి కలిసి వస్తుందని, పవన్ కనుక బిజెపి,టీడీపీలను కలుపు కొన్ని వెళ్తే తనకు ముప్పు తప్పదని జగన్ మూడేళ్ల క్రితమే అంచనాకి వచ్చారు .అందుకే పవన్ ఎమోషన్ పై దారుణంగా దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రతిసారి పవన్ చంద్రబాబు దగ్గర పండగ మామూలు తెచ్చుకుంటాడని, కోట్లు దండుకున్నాడని, టిడిపి వాళ్ళు పవన్ కి ప్యాకేజీ ఇస్తారని, ఇలా ఒకటి కాదు నానా మాటలు అనేవారు. జగన్ తో పాటు, వైసిపి లోని ముఖ్యమైన నేతలు అంతా పవన్ కళ్యాణ్ ని మాటలతో కుమ్మేసేవారు. ముఖ్యంగా రోజా, గుడివాడ నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, నెల్లూరు అనిల్ యాదవ్, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, వీళ్లంతా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడేవాళ్లు. రోజా నోటి కి అయితే అడ్డు అదుపు ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ సినిమాలు గురించి, భార్యలు, విడాకులు గురించి విపరీతంగా నోరు పారేసుకున్నారు రోజా. అంబటి రాంబాబు అయితే జనసేన అని ఎప్పుడు మాట్లాడతాడో అని ఎదురుచూసే వాడు.

రాంబాబు తన మూడేళ్ల కాలాన్ని కేవలం పవన్ ని తిట్టడానికే ఉపయోగించాడు. ఇక పేర్ని నాని అయితే చెప్పనక్కర్లేదు. కాపులను కాపులచేతే తిట్టించాలి అన్న జగన్ ఫార్ములానే అనుసరించి పవన్ కళ్యాణ్ తిట్టడానికి తన పూర్తి కాలాన్ని వినియోగించాడు. చివరికి గుడివాడ అమర్నాథ్ లాంటివాడు కూడా పవన్ కళ్యాణ్ నాతో సెల్ఫీ దిగాడు అని చెప్పుకొని పవర్ స్టార్ ని కించపరిచే ప్రయత్నం చేశాడు. వీటన్నిటి ఫలితమే వైసీపీ ఓటమి అని జగన్ ఆలస్యంగా గుర్తించాడు. ఒకటికి పది సార్లు వైసీపీ నేతలు, ముఖ్యంగా కాపు నేతలు పవన్ కళ్యాణ్ ని బండ బూతులు తిడుతుంటే జనం సహించలేకపోయారు. ఈ అసెంబ్లీ ,లోక్సభ ఎన్నికల్లో కాపులు ఓట్లు మొత్తం ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా జనసేనకి నూటికి నూరు శాతం పడడం వెనక ఏకైక కారణం వైసీపీ పవన్ కళ్యాణ్ పట్టుకుని తిట్టడమే. పవన్ కళ్యాణ్ అవినీతిపరుడు కాదు, గతంలో ఏ పదవులు చేయలేదు, కుంభకోణాలు చేయలేదు, ఎవరి డబ్బు తినలేదు… జీవితంలో రెండుసార్లు విడాకులు తీసుకోవడం తప్ప ఇంక ఏ మరక లేనివాడు.

ఇదంతా జనానికి తెలుసు. అందుకే పవన్ పై వ్యక్తిగత ఆరోపణలు జనం పట్టించుకోలేదు. అయినా సరే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని వదిలిపెట్టలేదు. మాటలతో చీల్చి చెండాడారు. దీంతో అతనికి విపరీతమైన సానుభూతి వచ్చింది. కాపు సామాజికవర్గంతో పాటు, యూత్ లోను పవన్ కళ్యాణ్ పై సానుభూతి పెరిగింది. పాడిందే పాట పాచిపల్ల దాసరి అన్నట్లుగా రోజు ఒకటి విషయంపై వైసిపి వాళ్లు పవన్ ని తిట్టి తిట్టి జన అగ్రహానికి గురయ్యారు. ఎన్నికలకు ముందే కొందరు వైసిపి వాళ్ళు ఇది గుర్తించారు. ముఖ్యంగా పేర్ని నాని లాంటివాళ్ళు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు బందర్ లో కాపు సామాజిక వర్గం పెద్దలు మొహం మీదే చెప్పేశారు. మీరు పవన్ కళ్యాణ్ ని తిట్టి అందరికీ దూరమవుతున్నారు అని తెగేసి వివరించారు. ఇక తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలోని అయితే పవన్ మానియా మామూలుగా పని చేయలేదు. అడ్రస్ లేని టిడిపి నాయకులు కూడా పవన్ ఓట్ బ్యాంకు అనూహ్యమైన విజయాన్ని ఇచ్చింది. ఎన్నికలకు 15 రోజులు ముందు కడప నుంచి వచ్చి నామినేషన్ వేసిన ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ లాంటి అనామక టిడిపి నాయకుడు కూడా పవన్ వేవ్ లో ఏకంగా ఎంపీ అయిపోయాడు. ఇదంతా వైసిపి నేతల కండకావరం, అహంకారం వీటికి తోడు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా, ఇష్టానుసారంగా మాట్లాడదాం. ఈ డ్యామేజ్ మొత్తం ఆలస్యంగా గుర్తించాడు జగన్.

దీనికి ప్రధాన కారణం మొన్నటి ఎన్నికల్లో పవన్ ఓట్ బ్యాంకు ఏకంగా 18 శాతానికి పెరిగిపోవడంతో పాటు 110 నియోజకవర్గాల్లో టిడిపి గెలుపుకి ప్రత్యక్షంగా పరోక్షంగా జనసేన, పవన్ అభిమానుల ఓట్లే కారణమయ్యాయి. ఇదంతా గమనించాక పవన్ కళ్యాణ్ ని గెలికి తాము దారుణంగా డ్యామేజ్ చేయమని జగన్ అవగాహనకు వచ్చారు. అందుకే నేతలకు, క్యాడర్ కు ఇంటర్నల్ గా ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ వైఫల్యాలను, చంద్రబాబుని, లోకేష్ ని ఎంత వీలైతే అంత విమర్శించాలి. పవన్ కళ్యాణ్ ని మాత్రం సాధ్యమైనంత వరకు టచ్ చేయకుండా ఉండాలి. ఇది ఇప్పుడు వైసీపీ ఫార్ములా. గడచిన రెండు నెలలుగా జగన్ గాని, వైసిపి పెద్ద నేతలు గాని ఎక్కడ పవన్ కళ్యాణ్ ని పన్నెత్తు మాట అనలేదు. పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సార్లు అసెంబ్లీ లోను, బయట జగన్ పై ,వైసీపీపై, ఆర్థిక అరాచకంపై విమర్శలు చేసిన వాటి కూడా ఎక్కడ రియాక్ట్ కాలేదు వైసిపి నేతలు. అనుభవం అయితే గాని తత్వం బోధపడదని పవన్ కళ్యాణ్ విషయంలో వైసిపి తెలుసుకుంది. వ్యక్తిగత ఆరోపణలు, కుటుంబాలు గురించి వెకిలి మాటలు …ఇవేవీ జనం నవ్వుకోడానికి మాట్లాడుకోవడానికి తప్ప ఓట్లు కురిపించడానికి కాదని జగన్ కి అర్థమైంది. అందుకే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పై మాటలతోటాలు సంధించే జగన్ బ్యాచ్ ఇప్పుడు మౌనంగా ఉంది.