బ్రేకింగ్: బొత్సను సైలెంట్ గా దెబ్బ కొట్టిన పవన్…!

  • Written By:
  • Updated On - August 6, 2024 / 04:58 PM IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కూటమి భావిస్తోంది. ఇందుకోసం క్యాంప్ రాజకీయాలకు కూడా కూటమి నేతలు సిద్దమయ్యారు. ఎలాగైనా శాసనమండలిలో బొత్సా అడుగు పెట్టకూడదని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు కూటమి నేతలు. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు వైజాగ్ నుంచి జనసేనలో 5 మంది వైసీపీ కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు.

రాష్ట్ర కార్యాలయం లో జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించాక ఇదే మొదటి పొలిటికల్ జాయినింగ్స్ అన్నారు. నాకు ఇష్టమైన వైజాగ్ తో చేరికలు మొదలయ్యాయని… ప్రభుత్వ మీటింగ్ కు హాజరై రాజకీయ సమావేశాలు కొత్తగా ఉన్నాయన్నారు ఆయన.

వైసిపి వ్యక్తిగతంగా శత్రువు కాదని… నాయకులు మాట్లాడే విధానంతో నమ్ముకునే వారు నష్టపోతారని పవన్ హితవు పలికారు. అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు పవన్. రాబోయే రోజుల్లో వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలని పవన్ ఆశాభావం వ్యక్తం చేసారు. వైజాగ్ కాలుష్యం నియంత్రణకు అందరిపై బాధ్యత ఉందన్నారు. త్వరలో వైజాగ్ లో ఎన్విరాన్మెంటల్ ఆడిట్ జరుగుతుందని… వైజాగ్ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ పై కలిసికట్టుగా పోరాటం చేసి ప్రజల సమస్యలు పరిష్కరిద్దామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు ముందు ఇలా కార్పొరేటర్లు చేరడం హాట్ టాపిక్ గా మారింది. ఇలా కీలక సమయంలో కార్పొరేటర్లు పార్టీ మారడం వైసీపీకి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు.