CM RAMESH : సీఎం రమేష్ కి.. మైలేజ్ ఇచ్చిన వైసీపీ

అనకాపల్లి (Anakapalli) లోక్ సభ సీటుకు కూటమి అభ్యర్థిగా బీజేపీ (BJP) తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్ (CM Ramesh) కు వైసీపీ (YCP) నేతలే దగ్గరుండి మైలేజీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

 

 

 

అనకాపల్లి (Anakapalli) లోక్ సభ సీటుకు కూటమి అభ్యర్థిగా బీజేపీ (BJP) తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్ (CM Ramesh) కు వైసీపీ (YCP) నేతలే దగ్గరుండి మైలేజీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. GST అధికారులను బెదిరించారన్న కేసులో రమేష్ పై చోడవరం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా పోలీసులు 41A నోటీసులు ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నోటీసులను అడ్డం పెట్టుకొని ఇష్యూని తనకు అనుకూలంగా మార్చుకోవాలని సీఎం రమేష్ డిసైడ్ అయ్యారు. దాంతో ఎన్నికల టైమ్ లో వైసీపీ నేతలు సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అర్థమవుతోంది.

నాలుగు రోజుల క్రితం చోడవరంలో ఓ టైల్స్ వ్యాపారి షాపుపై GST అధికారులు దాడులు చేశారు. అది నిబంధనల మేరకు జరిగిందా… అసలు వ్యాపారికి నోటీసులు ఇచ్చారా అని సీఎం రమేష్ సంఘటనా స్థలంలో అధికారులను నిలదీశారు. అయితే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తమను కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారనీ… ఇవ్వలేదన్న కక్షతోనే GST అధికారులతో దాడి చేయించినట్టు వ్యాపారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యేనని మండిపడుతున్నారు. GST అధికారుల చర్యను కొందరు వ్యాపారులు కూడా తప్పుబట్టారు.

సీఎం రమేష్ పై GST అధికారులతో YCP నేతలు పోలీసులకు కంప్లయింట్ చేయించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. రమేష్ తో పాటు చోడవరం MLA అభ్యర్థి రాజు, ఇతర నేతలపైనా ఫిర్యాదు చేయించారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపణలు చేశారు. ఈ కేసులో సీఎం రమేష్, ఇతర నేతలకు పోలీసులు 41A నోటీసులు ఇవ్వడంతో కూటమి అభ్యర్థులకు ప్లస్ అయింది. ఎన్నికల టైమ్ లో ఇలాంటి మంచి అవకాశం రావడంతో… సీఎం రమేష్ భారీగా వ్యాపారులు, టీడీపీ, బీజేపీ నేతలను వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నారు. అంతేకాదు… ధర్మశ్రీ అవినీతి, వేధింపులపైనా కొందరు వ్యాపారులతో పోలీసులకు కంప్లయింట్ ఇప్పిస్తున్నారు. ఈ వ్యవహారం వైసీపీకి బూమరాంగ్ అవనుంది. గోరుతో పోయే దానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నందుకు వైసీపీ నేతలు ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. అటు సీఎం రమేష్ తో సహా కూటమి నేతలు మాత్రం ఖుషీగా ఉన్నారు.