ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మొత్తం సీట్లల్లో కనీసం 10శాతం అంటే… 18 స్థానాలు రావాలి. అప్పుడే జగన్ కి ప్రతిపక్ష నేత హోదా దక్కతుంది. కానీ జగన్ మాత్రం నాకు అపోజిషన్ లీడర్ ఎందుకివ్వరు… 10శాతం నిబంధన చట్టంలో లేదు కదా అని వాదిస్తున్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి… స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి ఓ లెటర్ రాశారు. నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వొద్దని ముందే ఫిక్స్ అయ్యారా…. అందుకే అసెంబ్లీలో మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి… అందుకోసం 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్ లో, ఉమ్మడి ఏపీలో కూడా ఈ రూల్ పాటించలేదు. నా మీద అధికార కూటమి, స్పీకర్ ఎందుకు శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు జగన్. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజాసమస్యలు బలంగా వినిపించడానికి అవకాశం ఉంటుందని లెటర్ లో రాశారు. రాజ్యాంగంలో శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977 ప్రకారం
ఆర్టికల్ 168 నుంచి 221 వరకూ అసెంబ్లీలు, మండళ్ళ నిర్వహణ, విధుల గురించి ప్రస్తావన ఉంది. ఏదైనా చట్టసభలో అధికారంలో ఉండే పార్టీ తర్వాత.. అది పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. రాజ్యాంగంలో ఉంది… అందుకే అపోజిషన్ లీడర్ కావాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన చట్టంపై ఆయనకు అవగాహన లేదని అంటున్నారు పరిశీలకులు. 1977లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక లీడర్ ఆఫ్ అపోజిషన్ కి చట్టబద్ధత కల్పించారు. దాని ప్రకారం చట్టసభల్లో 10 శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది. అంటే లోక్ సభలో 55 సీట్లు రావాలి. అదే ఏపీ అసెంబ్లీలో అయితే 18 సీట్లు దక్కాల్సిందే.
అపోజిషన్ లీడర్ తో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే… కేబినెట్ హోదా ఉంటుంది.. సభలో సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యత ఉంటుంది. కేబినెట్ హోదాతో పాటు PS, PA సహా సిబ్బంది, అలవెన్సులు, ప్రోటోకాల్ వర్తిస్తుంది. సభలో చర్చల సందర్భంగా స్పీకర్ ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీ ఉంటుంది. ప్రశ్నలు వేసే విషయంలోనూ ప్రియారిటీ ఇస్తారు. బిల్లులపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత హోదా ఉన్న పార్టీకి ప్రాధాన్యత దక్కుతుంది.
కాంగ్రెస్ కే దిక్కులేదు..
2014 లో కాంగ్రెస్ కి పార్లమెంటులో 44 సీట్లు వచ్చాయి. 2019లో 52 స్థానాలకు పరిమితమైంది. దాంతో అపోజిషన్ లీడర్ ఇవ్వడానికి NDA ఒప్పుకోలేదు. ఆ టైమ్ లో ప్రతిపక్ష నేత హోదా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్. కానీ తాము స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ఆ పిటిషన్ తిరస్కరించింది. దాంతో లోక్ సభలో రెండో పెద్ద పార్టీ అయినా కాంగ్రెస్ కి అపోజిషన్ హోదా రాలేదు.
జగన్ బాధేంటి..
జగన్ కి ప్రతి పక్ష నేత హోదా దక్కదు. అంటే అసెంబ్లీలో ఆయనకు సీటు ఎక్కడ ఇవ్వాలన్నది స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయమే ఫైనల్. సభ జరుగుతున్నప్పుడు చర్చకు టైమ్ కేటాయించాల్సిన అవసరం లేదు.. జగన్ సాధారణ ఎమ్మెల్యే మాత్రమే… పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆయనకు కేబినెట్ హోదా ఉండదు. సాధారణ ఎమ్మెల్యే హక్కులే ఉంటాయి. గత ఐదేళ్లల్లో అయ్యన్నపాత్రుడుపై కేసుల మీద కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో…. చట్టప్రకారం కూడా జగన్ కి అపోజిషన్ లీడర్ ఇచ్చే అవకాశం లేనప్పుడు… అయ్యన్న మాత్రం ఎందుకిస్తారు ?