ఒకడు గంట…. అరగంట అని అమ్మాయిలతో బేరాలు ఆడతాడు. ఒక ఎంపీ వీడియో కాల్‌లో మహిళా నేతలతో శారీరక అరాచకం చేస్తాడు. ఇంకొకడు ప్రభుత్వ మహిళా అధికారిణితో అఫైర్ పెట్టుకుంటాడు. వేరొకడు బహిరంగంగానే సెకండ్ సెటప్ పెట్టి… ఇది అడల్ట్రీ అని సర్టిఫికెట్ ఇచ్చుకుంటాడు. అన్నిటికన్నా దరిద్రం.. జైలుకెళ్లి వచ్చిన ఒక ఎమ్మెల్సీ.. వీడియో కాల్‌లో అంగ ప్రదర్శన చేస్తాడు. అసలు ఏంటి ఈ పార్టీ… ఇది రాజకీయ పార్టీయేనా లేక బ్రోతల్ కంపెనీయా అని జనం మాట్లాడుకుంటున్నారు. ఇలా వైసీపీ నేతల అరాచకాలు రోజుకు ఒకటి బయటపడుతుంటే… జగన్ తల గోడకేసి కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు వైసీపీ నేతల కూడా అరాచకాలు ఒకేలా ఉన్నాయ్. ముఖ్యంగా నేతల అక్రమ సంబంధాలు, లైంగిక వ్యవహారాలు… రోజురోజుకి పార్టీ పరువును దిగజార్చుతున్నాయ్. అసలే అధికారం కోల్పోయి… దారుణమైన ఓటమిని చవిచూసి… అయోమయ స్థితిలో పడిపోయిన వైసీపీకి ఆ పార్టీ నేతల అక్రమ లైంగిక వ్యవహారాలు మరింత పరువు తీస్తున్నాయి. అంతేకాదు… టీడీపీ మీడియాకు ఆహారంగా మారిపోతున్నాయ్. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్… ఒక మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ చేసిన అంగ ప్రదర్శన మూడేళ్ల కింద రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇలాంటి వ్యవహారాలు బయట పడినప్పుడు వెంటనే వచ్చే సమాధానం… ఆ వీడియో మార్ఫింగ్ చేశారు అని! వైసీపీ నేతలు ఫోటోషాప్, వీడియో మార్ఫింగ్ అనే రెండు పదాలు బట్టీ పట్టి ఇలాంటివి జరిగినప్పుడల్లా వాటిని వాడేస్తూ ఉంటారు. గోరంట్ల మాధవ్ వీడియోని అడ్డంపెట్టి.. టీడీపీ మూడున్నరేళ్లు వైసీపీని ఆడుకుంది. మాధవ్‌కి ఎంపీ సీట్ కూడా పోయింది. ఇక అంబటి రాంబాబు వ్యవహారం అయితే రాష్ట్రంలో అంతా ఇంతా రాజకీయ రచ్చ సృష్టించలేదు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లు… నిత్యం ప్రెస్‌మీట్‌లు పెడుతూ అందరికీ నీతులు చెప్పే అంబటి రాంబాబు అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఒక మహిళతో ఆయన… ఎంతకీ వస్తావ్, గంట, అరగంట అని మాట్లాడిన ఆడియో… ఆయన పరువుని, కుటుంబ పరువుని, పార్టీ పరువుని తీసింది. ఈ వ్యవహారాన్ని కవర్ చేసుకోవడానికి అంబటి ఎన్ని కబుర్లు చెప్పినా… జనంలో ఆయన జోకర్‌గానే మిగిలారు. ఇక మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్…. ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడుతూ ఫోన్ కాల్ రికార్డింగ్‌లో దొరికిపోయారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కూడా అవంతి శ్రీనివాస్‌ని.. అవంతి, బంతి, చామంతి, పూబంతి అని ఒక ఆట ఆడుకునేవారు. బొత్స మేనల్లుడు… విజయనగరం ఇంచార్జి మజ్జి శ్రీనివాస్ అలియాస్ డాన్ శ్రీను మరీ దారుణం. ఆయన కొన్నేళ్లుగా మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ… ఏకంగా ఆమె కూతురుని తన రాజకీయ వారసురాలుగా ప్రకటించేశారు. ఆ అమ్మాయి పేరుతో వ్యాపారాలు చేస్తూ… బహిరంగంగానే అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు. ఇక ఆయన మేనమామ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా తక్కువేమీ తినలేదు. కొన్నేళ్ల కింద ఒక మహిళతో బ్యాంకాక్‌లోని పటాయా వీధుల్లో సంచరిస్తూ కెమెరాలకు దొరికిపోయారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా… ఆ వీడియో మళ్లీ వైరల్ అయింది. కాకపోతే టీడీపీ మీడియా ఆశించినంత రచ్చ చేయలేదు. ఆ వీడియోతో బొత్స ఎంతో కొంత డ్యామేజ్ అయ్యారు. వైసీపీ కూడా పరువు పోగొట్టుకుంది. కొద్దిరోజుల క్రితం వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డికి… దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి శారీరక సంబంధం ఉందంటూ…. వాళ్లకు ఓ బిడ్డ కూడా పుట్టాడని.. ఏకంగా శాంతి భర్త మీడియాలోకి ఎక్కి రచ్చ చేయడంతో.. వైసీపీలో చిన్న సైజు తుఫానే రేగింది. దీంతో సాయిరెడ్డి కోర్టుకెక్కారు. అయినా సరే.. కుక్కకి మాంసం ముక్క దొరికినట్లుగా ఎల్లో మీడియా వైసీపీ వాళ్లని వదిలిపెడుతోందా…. విజయసాయిరెడ్డి, శాంతి సంబంధాలపై డీఎన్‌ఏ టెస్టుల వరకు తీసుకెళ్లిపోయారు. చివరికి కోర్టులు జోక్యం చేసుకొని వార్నింగ్ ఇచ్చి… టీవీల్లో ఈ అరాచకాన్ని కంట్రోల్ చేసినప్పటికీ… పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ కన్నా ఎక్కువే జరిగింది. వైసీపీ లీడర్లకు ఇవన్నీ మామూలేగా అని జనం నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఆ సంఘటన జరిగిన కొన్ని రోజులకే… టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మహిళా నాయకురాలు మాధురి మధ్య అక్రమ సంబంధం రోడ్డెక్కింది. దువ్వాడ భార్య వాణి పది రోజులు పాటు దువ్వాడ ఇంటి ఎదురుగా ధర్నా చేసి… ఈ వ్యవహారాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేసింది. మళ్లీ టీడీపీ మీడియా ఛానల్స్‌కు, సోషల్ మీడియాకు…