YCP MPs Jump : బీజేపీలోకి వైసీపీ ఎంపీలు…. చంద్రబాబు బాటలో జగన్ !

ఒకప్పుడు చంద్రబాబు మెథడ్ నే ఇప్పుడు జగన్ కూడా ఫాలో అవుతున్నారు. తమ రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపాలని డిసైడ్ అయ్యారు. ఏడుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీలు... ఢిల్లీ బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు బీజేపీలో చేరే అవకాశాలున్నాయి.

  • Written By:
  • Updated On - June 18, 2024 / 01:53 PM IST

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. అటు పార్లమెంట్ లోనూ నాలుగు సీట్లే గెలుచుకుంది. వై నాట్ 175 అని గప్పాలు పలికి…. తీరా డజన్ సీట్లు కూడా గెలవలేకపోవడంతో మాజీ సీఎం జగన్ కు రాబోయే 5 యేళ్ళు ఎలా గడపాలో అర్థం కావట్లేదు. మొన్నటిదాకా కేంద్రంలో NDA ప్రభుత్వం అండ ఉండేది. ఇప్పుడు టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసిపోవడంతో ఆ ఛాన్స్ కూడా మిస్ అయింది.
అందుకే ఒకప్పుడు చంద్రబాబు మెథడ్ నే ఇప్పుడు జగన్ కూడా ఫాలో అవుతున్నారు. తమ రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపాలని డిసైడ్ అయ్యారు. ఏడుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీలు… ఢిల్లీ బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. లోక్ సభలో బీజేపీకి… టీడీపీ, జేడీయూతో కలవడం వల్ల మెజార్టీ ఉంది. దాంతో అక్కడ బిల్లుల ఆమోదానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ రాజ్యసభలో ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం 82 మంది మాత్రమే. వైసీపీకి ఉన్న ఎంపీల సంఖ్య 11. అందుకే వైసీపీ ఎంపీలను చేర్చుకోడానికి బీజేపీ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
గతంలో ఇలాగే బీజేపీలో చేరారు టీటీపీ రాజ్యసభ సభ్యులు. అప్పట్లో సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావు బీజేపీలో చేరి… ఆ పార్టీ సభ్యులుగా కొనసాగారు. ఇప్పుడు కూడా ఏడుగురు వైసీపీ రాజ్య ఎంపీలు బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. పైగా వీళ్ళల్లో విజయ్ సాయి రెడ్డి లాంటి వాళ్ళపై ఈడీ, సీబీఐ కేసులు కూడా ఉన్నాయి. బీజేపీలో చేరితే… ఆ కేసుల నుంచి రిలీఫ్ దొరుకుతుందని కూడా ఆలోచిస్తున్నారు. అటు జగన్ కూడా సేవ్ అవ్వొచ్చన్నది ఆలోచన.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో… ఏపీకి చెందిన కొందరు లీడర్లు బీజేపీ లీడర్ల టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి విడదల రజనీ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె లాగే మరికొందరు కూడా కమలం నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.