YCP vs Janasena : వైసీపీ సీట్లు 11.. పవన్ దీక్ష 11 రోజులు.. ఇదెక్కడి ట్రోలింగ్‌ బాబోయ్‌..

చెప్తే కామెడీగా ఉంటుంది కానీ.. రాజకీయాల్లోని కొన్ని విషయాలను తెలియకుండానే హైలైట్‌ చేస్తుంటారు ఫాలోవర్లు. ఇప్పుడు అదే జరిగింది.

 

 

 

చెప్తే కామెడీగా ఉంటుంది కానీ.. రాజకీయాల్లోని కొన్ని విషయాలను తెలియకుండానే హైలైట్‌ చేస్తుంటారు ఫాలోవర్లు. ఇప్పుడు అదే జరిగింది. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటయింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే డ్యూటీ ఎక్కేసిన పవన్‌.. తన పవర్‌ ఏంటో చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు పవన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. వాటి మీద పట్టు సాధించేందుకు సేనాని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదంతా ఎలా ఉన్నా.. ఎన్నికల ముందు వారాహి మీద ప్రచారాలు నిర్వహించిన పవన్.. ఇప్పుడు వారాహి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. 11 రోజుల పాటు వారాహి దీక్ష చేయబోతున్నారు. ఈ దీక్షలో ఉన్నన్ని రోజులు కేవలం ఫలహారాలు మాత్రమే పవన్ ఆహారంగా తీసుకునే చాన్స్ ఉంది. ఐతే ఇక్కడే సోషల్‌ మీడియాలో అసలు రచ్చ మొదలైంది. వైసీపీకి వచ్చిన సీట్లు 11.. పవన్ చేస్తున్న దీక్ష జరిగేది 11రోజులు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు జనసేన శ్రేణులు. వైసీపీకి 11 సీట్లు రావడంపై ఇప్పటికే సోషల్‌మీడియాలో ట్రోల్స్‌, మీమ్స్ పేలుతున్నాయ్. ఇప్పుడు పవన్ వారాహి దీక్ష 11 రోజులు చేయడం వెనక.. వైసీపీ సీట్లను గుర్తుచేయడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్‌.

పవన్ ప్రతి ఏడాది 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష చేస్తూ ఉంటారు. అయితే పవన్ మాత్రం ఇది కావాలని ఏమి చేయడం లేదు. వారాహి దీక్ష అనేది 11 రోజులు ఉంటుందని పండితులు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పవన్‌ జోరు చూసి జనసైనికులు, అభిమానులు పోస్టులు పెడుతున్నారు. పవన్ ఐడియాలజీ, వ్యక్తిత్వం గురించి ట్వీట్‌లు చేస్తున్నారు. ఈ మధ్యే టాలీవుడ్ నిర్మాతలతో భేటీ అయిన పవన్.. హుందాగా వ్యవహరించిన తీరు ప్రతీ ఒక్కరితో శభాష్ అనిపించేలా చేస్తోంది.