ఏపీ ఫలితాల్లో వైసీపీ పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం ప్రతిపక్ష హోదా సాధించలేకపోయిది. కేవలం ఐదేళ్లలో ఈ స్థాయిలో జనాల్లో వ్యతిరేకత తెచ్చుకున్న పార్టీ.. బహుశా చరిత్రలో కూడా ఏదీ లేదు అనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీకి.. ఐదేళ్లు తిరిగే సరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. మంత్రులు, మాజీ మంత్రులు.. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారంటే.. జనం ఎంత కసిగా ఉన్నారో చెప్పొచ్చు. వైసీపీ ఘోర పరాభవానికి ఏకైక కారణం.. జగనే ! విన్నది నిజమే.. జగన్‌ను ఓడించింది జగనే ! ఇదే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. పార్టీని గాలికి వదిలేశారు.. క్షేత్రస్థాయిలో నేతల అరాచకం దృష్టికి వచ్చినా కనీసం పట్టించుకోలేదు. ఎదురు తిరిగిన వాళ్ల మీద కక్ష పెంచుకున్నారు.
ఓవరాల్‌గా జనాలకు దూరంగా ఉన్నారు. అదే.. ఇప్పుడు వైసీపీ ఘోర పరాభవానికి కారణంగా మారింది. మోనార్క్‌లా నచ్చింది చేయడం.. నచ్చకపోతే టార్గెట్ చేయడం.. ఐదేళ్లలో జగన్ చేసింది ఇదే. ఈ వ్యవహారమే జనాల్లో కసిని రగిలించింది. పదేళ్లు సీఎంగా మనమే అటూ తనకు తానే ప్రకటించుకోవడం.. వైనాట్ 175 అంటూ అహంకారం ప్రదర్శించడం.. జనం ఏమనుకుంటున్నారో పట్టించుకోకపోవడం.. కనీసం పరిస్థితులకు తగినట్లు మారకపోవడంతో.. జగన్‌ను దెబ్బతీసింది. ఓవరాల్‌గా వైసీపీని ఓటమికి చేర్చింది. ప్రజావేదిక కూలగొట్టడంతో విధ్వంసాన్ని స్టార్ట్ చేసిన జగన్.. ఒక్కరి సలహా తీసుకున్నట్లు కనిపించలేదు. అంతా తానే, అన్నీ తానే అనే లెవల్‌లో నిర్ణయాలు తీసుకొని.. అమలు చేయడం మొదలుపెట్టారు. రాజధాని విషయంలో జగన్ చూపించిన కన్ఫ్యూజన్.. వైసీపీ మీద జనాల్లో మరింత కోపాన్ని రగిల్చింది. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయి.
కేపిటల్ ఏంటో చెప్పుకోలేని అవమాన స్థితిలోకి తమను నెట్టేశారని.. జనాలు మండిపోయారు. కోపాన్ని ఓట్ల రూపంలో చూపించారు. అమరావతితో పాటు మరో మూడు రాజధానులు అని ప్రకటించిన జగన్.. ఐదేళ్లలో అమరావతి రైతులను ఒక్కసారి కూడా కలవలదు. అదీ ఆయన అహంకారం లెవల్. చంద్రబాబుతో సహా విపక్ష నేతలను అరెస్ట్ చేయించడం… పోలవరం ప్రాజెక్ట్‌ను గాలికి వదిలేయడం.. రాష్ట్రానికి హోదా కానీ, ప్రత్యేక నిధులను తీసుకురాకపోవడం.. ఇలా ప్రతీ విషయలో ఐదేళ్లలో జగన్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయ్. ఇలా తను చేసిన తప్పులు.. తను మిగిల్చిన పొరపాట్లే.. జగన్‌ను ఇప్పుడు పరాజితునిగా మిగిల్చాయ్. వైసీపీ దారుణ పరాభవానికి కారణంగా మారాయ్.