YCP : వారసులంతా ఔట్‌…

ఏపీ ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్తు తలకిందులయ్యింది. గత ఎన్నికల్లో 150 స్థానాలు గెలిచిన ఆ పార్టీ ఇప్పుడు కేవలం 10 స్థానాలకే పరిమితయ్యింది. రీసేంట్‌ డేస్‌లో ఎప్పుడూ ఎక్కడా చూడని పతనం ఇది.

 

 

ఏపీ ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్తు తలకిందులయ్యింది. గత ఎన్నికల్లో 150 స్థానాలు గెలిచిన ఆ పార్టీ ఇప్పుడు కేవలం 10 స్థానాలకే పరిమితయ్యింది. రీసేంట్‌ డేస్‌లో ఎప్పుడూ ఎక్కడా చూడని పతనం ఇది. మంచి జరిగితేనే ఓటు వెయ్యిండి అని జగన్‌ చెప్తే.. పది స్థానాలకే జగన్‌ను పరిమితం చేశారు ఏపీ ప్రజలు. దీంతో ఎన్నో ఆశలతో రాజకీయ అరంగేట్రం చేసిన యువ నేతలు కూటమి సునామీలో కొట్టుకుపోయారు.

ఈ సారి ఎన్నికల్లో చాలా మంది వైసీపీ నేతలు తాము తప్పుకుని వాల్ల వారసులకు టికెట్టు ఇప్పించుకున్నారు. వైసీపీ అధినేత జగన్‌ కూడా వాళ్ల కోరికమేరకు వాళ్ల వారసులకు టికెట్లు ఇచ్చాడు. కానీ ఏపీలో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్‌ వాళ్ల పాలిట శాపంగా మారింది. తిరుపతి నుంచి భూమన జయరాం రెడ్డి తన కొడుకు అభినయ్‌ రెడ్డికి టికెట్‌ ఇప్పించుకున్నారు. కానీ ఈ ఎన్నికల్లో అభినయ్‌ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. బందరు నుంచి మాజీ మంత్రి పేర్ని నాని తన కొడుకు పేర్ని కిట్టుకు టికెట్‌ ఇప్పించుకున్నారు.

జగన్‌ కూడా భారీ సభలో కిట్టును వైసీపీ శ్రేణులు, అభిమానులకు పరిచయం చేశారు. కిట్టును గెలిపించుకునేందుకు నాని అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. పేర్ని కిట్టు దారుణంగా ఓడిపోయారు. ఇక చంద్రగిరి నుంచి కూడా మోహిత్‌ రెడ్డి తన తండ్రి భాస్కర్‌ రెడ్డి స్థానంలో పోటీ చేశారు. కానీ కూటమి తుఫాను ముందు కూలిపోయాడు. ఇలా పొలిటికల్‌ కెరీర్‌ను స్టార్ట్‌ చేయాలి అనుకున్నవాళ్లంతా కూటమి ముందు కూలిపోక తప్పలేదు.