YS JAGAN: పొత్తుల పేరుతో కుటుంబాల్ని చీల్చి రాజకీయం చేస్తారు: జగన్

చంద్రబాబు, పవన్‌ కలిసి 2014 ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు. పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదు.

  • Written By:
  • Publish Date - January 3, 2024 / 02:53 PM IST

YS JAGAN: ఎన్నికల వేళ పొత్తుల పేరుతో కుటుంబాన్ని చీల్చి, రాజకీయ కుట్రలకు తెరలేపుతారని విమర్శించారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు, పవన్‌పై విమర్శలు గుప్పించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

YV Subbareddy: షర్మిల కాంగ్రెస్‌లో చేరినా మాకు ఇబ్బందేం లేదు: వైవీ సుబ్బారెడ్డి

”చంద్రబాబు, పవన్‌ కలిసి 2014 ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు. పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు..? అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడు. చంద్రబాబు అవినీతిలో పవన్‌ కూడా పార్ట్‌నరే. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. ఇప్పుడు పేదలకు ఇళ్ళు కడుతుంటే దత్తపుత్రుడు కేంద్రానికి లేఖ రాస్తాడు. ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేడు. అవినీతి జరగకపోయినా అభాండాలు వేస్తున్నాడు. ఈ అవినీతిపరులు.. అవినీతికి ఆస్కారం లేకుండా పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో పెన్షన్‌ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెన్షన్‌ రూ.58వేలు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం రూ.లక్షా 47వేలు అందిస్తున్నాం. ఇప్పుడు 66.34 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం. పెన్షన్‌ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. గతానికి, ఇప్పుటికి తేడా చూడండి. గతంలో జన్మభూమి కమిటీలకి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు అర్హులైన వాళ్లందరికీ పెన్షన్లు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో కుట్రలు, కుటుంబాల్ని చీల్చే రాజకీయాలు చేస్తారు. చంద్రబాబు, పవన్.. మరిన్ని పొత్తులు పెట్టుకుంటారు. పొత్తుల కోసం కుటుంబాలను చీలుస్తారు” అని జగన్ విమర్శించారు.