YS JAGAN: జగన్‌కు ఓటమి తప్పదా..! టెన్షన్ పెడుతున్న సర్వేలు !!

వైసీపీ ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత, కాంగ్రెస్‌లోకి షర్మిల రావడం, టీడీపీ-జనసేనకు పెరుగుతున్న మద్దతు.. వీటికితోడు ఇప్పుడు సర్వేలు టెన్షన్ పెట్టిస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ లేటెస్ట్ సర్వేల్లో అధికార వైసీపీకి ఈసారి ఓటమి తప్పదనీ.. టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తుందని తేల్చింది.

  • Written By:
  • Publish Date - January 1, 2024 / 06:31 PM IST

YS JAGAN: వై నాట్ 175 అంటూ ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి అధికారం రావాలనే లక్ష్యంతో వ్యూహాలు పన్నుతున్న వైసీపీ చీఫ్, సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుస సర్వేలు చెమటలు పట్టిస్తున్నాయి. నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చుకుంటూ పోతే.. మళ్ళీ ఈజీగా గెలవొచ్చని జగన్ ప్లాన్ చేసుకున్నారు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరుసగా రిలీజ్ అవుతున్న సర్వేలు టీడీపీ – జనసేన కూటమికి అనుకూలంగా వస్తుండటంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. తెలంగాణలో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లే BRS ఓడిపోయింది. ఈ ఒక్క పాయింట్ ముందు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల వారీగా ప్రక్షాళన మొదలుపెట్టారు వైసీపీ చీఫ్ జగన్.

REVANTH REDDY: మెట్రో ప్రాజెక్టు రద్దు చేయం.. పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో: సీఎం రేవంత్

ప్రస్తుతం ఉన్న సిట్టింగ్స్‌లో దాదాపు 60మందిని తొలగించాలని డిసైడ్ అయ్యారు. ఈ పనిలో బిజీగా ఉన్న జగన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత, కాంగ్రెస్‌లోకి షర్మిల రావడం, టీడీపీ-జనసేనకు పెరుగుతున్న మద్దతు.. వీటికితోడు ఇప్పుడు సర్వేలు టెన్షన్ పెట్టిస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ లేటెస్ట్ సర్వేల్లో అధికార వైసీపీకి ఈసారి ఓటమి తప్పదనీ.. టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తుందని తేల్చింది. ఐదేళ్ళ వైసీపీ పాలనలో జనం ఏమనుకుంటున్నారు.. నెక్ట్స్ ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు.. జిల్లాల్లోని పరిస్థితులతో ప్రజాభిప్రాయాన్ని నిర్వహించింది చాణక్య స్ట్రాటజీస్. ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లో చేసిన సర్వే ఫలితాలను వెల్లడించింది. ఇందులో టీడీపీ – జనసేన కూటమికి 115 నుంచి 128 సీట్లు వస్తాయని తేలింది. అధికార వైసీపీకి కేవలం 42 నుంచి 55 సీట్లు మాత్రమే దక్కుతాయి. మరో 18 సీట్లల్లో అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ తప్పదని చాణక్య స్ట్రాటజీస్ తేల్చింది. ఈ మూడు పార్టీలే కాకుండా.. ఇతర పార్టీలకు 4 నుంచి 7 సీట్లు దక్కే అవకాశముందని సర్వేలో వెల్లడైంది.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమికి అనేక కారణాలను చాణక్య స్ట్రాటజీస్ విశ్లేషించింది. అందులో తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ గెలుపు, వైసీపీ నవరత్నాల ప్రభావం, రాష్ట్రంలో ఉచితాలే గానీ.. అభివృద్ధిపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం, చంద్రబాబు అరెస్ట్, వైఎస్సార్ – జగన్ ప్రభుత్వాల మధ్య తేడా, కుల సమీకరణాలు, టీడీపీ-జనసేన కూటమిగా ఏర్పడం, గ్రామాల్లో నేతల ప్రభావం, ధరల పెరుగుదల, ఉద్యోగులకు జగన్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం లాంటివి వైసీపీ ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఆత్మసాక్షి రిలీజ్ చేసిన సర్వేలోనూ టీడీపీ-జనసేన కూటమిదే విజయం అని తేలింది. ఈసారి తెలుగుదేశం 54శాతం ఓట్లతో అధికారం చేపడుతోందని సర్వే తెలిపింది. టీడీపీ-జనసేన విడిగా పోటీ చేస్తే జనసేనకు పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా ఆత్మసాక్షి సర్వే తెలిపింది. ఈ రెండూ కూటమిగా అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడితే.. టీడీపీకి 95 సీట్లు, జనసేనకు 13 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే వైసీపీకి 60 సీట్లు దక్కుతాయని సర్వే తేల్చింది. జనసేన-టీడీపీ కలవడం వల్లే ఆ కూటమి ఏపీలో అధికారంలోకి వస్తుందని ఆత్మసాక్షి సర్వే తేల్చింది.

అంతకుముందు టైమ్స్ నౌ మాత్రమే వైసీపీ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలో ప్రకటించింది. లేటెస్ట్‌గా వచ్చిన చాణక్య స్ట్రాటజీస్, ఆత్మసాక్షి సర్వేలు మాత్రం టీడీపీ-జనసేనకు అధికారం దక్కుతుందని ప్రకటించడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. జగన్ చెల్లెలు షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో చేరుతుండటంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కంటే తమ వైసీపీ ఓటు బ్యాంకుకే ఎక్కువ నష్టం కలుగుతుందని భయపడుతున్నారు. ఆమె ఏపీ పాలిటిక్స్‌లోకి రాకుండా రాజీ ప్రయత్నాలు, బుజ్జగింపులు కూడా నడిచినట్టు సమాచారం. వైసీపీలో టిక్కెట్టు దక్కని సిట్టింగ్స్ అంతా షర్మిలను చూసి.. కాంగ్రెస్‌లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఇంఛార్జులను మార్చడం వల్ల చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి పోరు నడుస్తోంది. ఇప్పుడు ఈ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరితే ఎక్కువగా నష్టపోయేది మాత్రం వైసీపీనే అంటున్నారు.