TOP STORY: రాజీ పడదాం రా షర్మిల తో సెటిల్ చేసికుంటున్న జగన్

వైనాట్ 175 అంటూ గర్జించిన ఆ స్వరం ఇప్పుడు మూగబోయింది. గాయపడిన సింహం నుంచి వచ్చిన శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అంటూ రాకీ భాయ్ డైలాగులు ఫ్యాన్స్ చెప్తున్నా సీన్ మాత్రం రివర్స్ లో ఉంది. కేజిఎఫ్ కంటే పెద్ద గొయ్యి ముందు వెనుకా ఉంది.

  • Written By:
  • Publish Date - October 21, 2024 / 04:25 PM IST

వైనాట్ 175 అంటూ గర్జించిన ఆ స్వరం ఇప్పుడు మూగబోయింది. గాయపడిన సింహం నుంచి వచ్చిన శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అంటూ రాకీ భాయ్ డైలాగులు ఫ్యాన్స్ చెప్తున్నా సీన్ మాత్రం రివర్స్ లో ఉంది. కేజిఎఫ్ కంటే పెద్ద గొయ్యి ముందు వెనుకా ఉంది. ఓ వైపు టీడీపీ, మరో వైపు చెల్లెలు షర్మిల… ఢిల్లీలో సాయన్న హవా నడుస్తలేదు… డైరెక్షన్ ఎటో తెలియకుండా వరుస మీటింగ్ లు… ఇది వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరిస్థితి.

జగన్ సిచ్యువేషన్ కొన్ని విషయాల్లో టూ బ్యాడ్… కచ్చితంగా బలమైన జాతీయ పార్టీ అండ కావాల్సిందే. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీ కోసం అన్ని నేషనల్ హైవేలను వాడి ఢిల్లీ వెళ్తున్నారు. నేషనల్ హైవే ఎక్కడం కంటే ముందు… స్టేట్ హైవే ఎక్కి చెల్లెలు షర్మిలతో డీల్ సెట్ చేసుకోకపోతే కాంగ్రెస్ తో కష్టం. జనసేన నేత బాలినేని… వైసీపీకి గుడ్ బై చెప్తూ ఓ కామెంట్ చేసారు. విలీనం కావాల్సిందే గాని… షర్మిల కారణంగా వాయిదా పడుతోంది అని. అది నిజమే అని అర్ధమవుతోంది జనాలకు. షర్మిల కత్తికి రెండు వైపులా పదును ఉండటం జగన్ కు ఊపిరి సలపనీయడం లేదు. అందుకే రాజీ డేసీషన్ కు వచ్చేశారు.

షర్మిల ఎక్కడైతే తనతో విభేధించారో అక్కడే ఫుల్ స్టాప్ పెట్టడానికి రెడీ అయ్యారు. ఆస్తిలో వాటాలు పంచేందుకు రెడీ అయ్యారు. తండ్రి వైఎస్ బ్రతికి ఉన్నప్పుడు… తన ఆస్తిలో కూతురుకు కూడా వాటా ఉందని చెప్పేవారు. కాని ఆయన మరణం తర్వాత షర్మిల… జగన్ కు పార్టీ కార్యకర్త మాత్రమే అయ్యారు. ఆస్తిలో వాటాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు అని వార్తలు వచ్చాయి. పలు రకాలుగా ఆమెను వేధించి ఇంటి నుంచి దాదాపుగా వెలివేయడం సంచలనం అయింది. వైఎస్ తో అప్పట్లో సన్నిహితంగా ఉన్న వారు చెప్పినా జగన్ వినలేదు.

2019 ఎన్నికల్లో జగన్‌ కోసం తీవ్రంగా కష్టపడిన ఆమె… జగన్ కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వకపోవడం, ఆస్తులు ఇవ్వకపోవడంతో భారీ ఎత్తున యుద్దమే చేసారు. జగన్ ముఖ్యమంత్రి అయితే కనీసం తాను కార్పొరేటర్ కూడా కాలేదనే బాధ షర్మిలలో ఉంది. అందుకోసం పార్టీ పెట్టి నిలబడలేకపోయిన ఆమె… చివరకు కాంగ్రెస్ లో జాయిన్ కావడం జగన్ గొంతులో వేలక్కాయి పడినట్టు అయింది. తెలంగాణాకు మాత్రమే షర్మిల పరిమితం అనుకున్న జగన్… ఏపీ పీసిసి చీఫ్ కావడం ఊహించలేకపోయారు. అందుకే ఇప్పుడు రాజీకి వచ్చేశారు దాదాపుగా. ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు… రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు.

ఆమెతో ఘర్షణ కొనసాగిస్తే తనకు కాంగ్రెస్‌ వైపు చూసే చాన్స్‌ ఉండదని జగన్ కు అర్ధమైంది. తెలంగాణా, కర్ణాటక ప్రభుత్వాల్లో ఆమెకు పట్టు కూడా ఉంది. టీడీపీ, జనసేన దెబ్బకు కేంద్రంలో పెద్దల అండ కూడా లేకుండాపోయింది. ఇప్పుడు షర్మిలతో రాజీకి వెళ్ళకపోతే కాంగ్రెస్ కు దగ్గర కావడం కష్టం, అలాగే సొంత జిల్లాలో ఇబ్బందులు తప్పవు. మొన్న షర్మిల కడప ఎంపీ అభ్యర్ధిగా చుక్కలు చూపించారు. వచ్చే ఎన్నికల కోసం జగన్ కంటే షర్మిల ఎక్కువగా కాంగ్రెస్ తరుపున కష్టపడుతున్నారు.

ప్రజల్లో కూడా ఆమెకు ఇమేజ్ పెరుగుతోంది. అందుకే జగన్ పదే పదే బెంగళూరు వెళ్లి… షర్మిలతో రాజీకి బేరాలు సెట్ చేస్తున్నారు. జగన్ తగ్గే వరకు షర్మిల తగ్గే ఛాన్స్ లేదనేది క్లియర్ గా అర్ధమైంది. అందుకే జగన్ ఒక అడుగు వెనక్కు వేసారు. తగ్గితే తప్పేం ఉంది అని భార్యకు కూడా నచ్చజెప్పి… బెంగళూరు ప్యాలెస్ వేదికగా షర్మిలను కూల్ చేస్తున్నారు. ఆస్తుల్లో వాటాను తక్షణమే పంచుతా అని జగన్ చెప్పడంతో… అది జరిగితే కాంగ్రెస్ కు దగ్గర చేస్తా అని… షర్మిల హామీ ఇచ్చారట. చూద్దాం…