YS JAGAN Vs SHARMILA: షర్మిలకు పీసీసీ పదవి.. జగన్‌కు నష్టమేనా..?

షర్మిల రాక వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు కంటే వైసీపీ ఓట్లే ఎక్కువగా చీలుతాయి. మరి నేరుగా అన్నను టార్గెట్ చేస్తూ చెల్లెలు విమర్శలు చేస్తారా.. లేదా అన్నది చూడాలి. ఓ రకంగా షర్మిల ఏపీ కాంగ్రెస్‌లోకి రావడం కూడా లేట్ అయిందేమో.

  • Written By:
  • Publish Date - January 16, 2024 / 05:13 PM IST

YS JAGAN Vs SHARMILA: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమిస్తూ AICC ఆదేశాలిచ్చింది. దాంతో ఇప్పుడు ఏపీలో అన్న వర్సెస్ చెల్లెలు పోటీ నడవబోతోంది. పదేళ్ళుగా పడుకొని ఉన్న కాంగ్రెస్ పార్టీని లేపి నిలబెట్టడం షర్మిలకు సవాల్‌గా మారుతోంది. అలాగే అన్న జగన్ అధ్యక్షుడిగా ఉన్న వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలి. అటు టీడీపీ-జనసేన కూటమికి పోటీ ఇవ్వాలి. ఇలా APCC అధ్యక్షురాలిగా షర్మిల ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనిపించకుండా పోయింది. చాలామంది నేతలు జగన్ పెట్టిన వైఎస్సార్‌సీపీలో జాయిన్ అవడంతో హస్తం పార్టీ మరింత కుదేలైంది.

YS SHARMILA: షర్మిల భావోద్వేగం.. పీసీసీ చీఫ్‌ పదవిపై షర్మిల ఎమోషనల్

తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకొని, ఇక్కడ వర్కవుట్ కాక.. చివరకు ఏపీ కాంగ్రెస్‌లోకి వెళ్ళి స్థిరపడుతోంది వైఎస్ షర్మిల. ఇప్పుడామె ఏపీ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు కాబోతోంది. కాంగ్రెస్‌ను నిలబెట్టాలంటే షర్మిల మొదట టార్గెట్ చేయాల్సింది. అన్న జగన్మోహన్ రెడ్డినే. ఐదారేళ్ళ క్రితం దాకా వైసీపీని భుజాన వేసుకొని ప్రచారం చేసిన షర్మిల.. ఇప్పుడు అదే పార్టీపై ఎలా విమర్శలు చేస్తారు..? ముఖ్యంగా అన్నను ఎలా ఎదుర్కుంటారు..? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఏపీలో వైఎస్ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లను షర్మిల తిరిగి కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చే దానిపైనే ఆమె సక్సెస్ ఆధారపడి ఉంటుంది. రాహుల్ గాంధీ చెప్పినట్టుగా ఏపీలో ఆ పార్టీకి కనీసం 15 నుంచి 20 శాతం ఓట్లు రావడం అంటే కష్టమే. కానీ 10శాతం లోపు ఎంత సాధించినా.. అది వైసీపీకి తీరని నష్టమే అంటున్నారు. ఎందుకంటే జగన్‌లాగే షర్మిల కూడా వైఎస్సార్ బొమ్మనే పెట్టుకొని ప్రచారంలోకి వెళ్తారు. షర్మిల రాక వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు కంటే వైసీపీ ఓట్లే ఎక్కువగా చీలుతాయి. మరి నేరుగా అన్నను టార్గెట్ చేస్తూ చెల్లెలు విమర్శలు చేస్తారా.. లేదా అన్నది చూడాలి.

Chandrababu Naidu: అంబటి పంచ్‌.. చంద్రబాబు పిటిషన్‌పై అంబటి ఆసక్తికర ట్వీట్‌

ఓ రకంగా షర్మిల ఏపీ కాంగ్రెస్‌లోకి రావడం కూడా లేట్ అయిందేమో. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీ–జనసేనలోకి నేతల చేరికలు నడుస్తున్నాయి. వైసీపీలో టిక్కెట్లు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ రెండు పార్టీల్లో చేరుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే మాత్రమే షర్మిలతో కలసి వస్తానని చెప్పారు. అలాగే కాపు రామచంద్రారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇంకా వైసీపీలో పాతిక మందికి పైగా అసంతృప్తులు ఉన్నారు. వీళ్ళందర్నీ వీలైనంత తొందరగా కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం షర్మిల చేయాలి. అప్పుడు ఈసారైనా కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలిచే ఛాన్సుంది. లేకపోతే కొద్దో గొప్పో ఓట్లు పెరిగినా.. సీట్లు వచ్చే పరిస్థితి ఉండదు. బలమైన నాయకులను ఎంత మందిని కాంగ్రెస్‌లోకి తిరిగి తెస్తారన్నది షర్మిల సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. ఇక షర్మిల కడప లోక్‌సభ నుంచే పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇక్కడ ఆమె చిన్నాన్న వైఎస్ వివేకానంద హత్య కేసు ముద్దాయి, తన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా షర్మిల పోటీలోకి దిగుతుందన్న ప్రచారం నడుస్తోంది.

అదే జరిగితే.. కడపలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, సానుభూతిపరులు, కార్యకర్తలంతా.. షర్మిలను సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కడప ఎంపీగా షర్మిల గెలిస్తే.. అది జగన్‌కు మొదటి దెబ్బ అవుతుంది. తనకు పట్టున్న సామ్రాజ్యంలోకి చెల్లెలు అడుగుపెట్టినట్టే అవుతుంది. షర్మిల రాకపై జగన్ ఇప్పటికే ఒకసారి చూచాయిగా స్పందించారు. కుటుంబ సభ్యులను చీల్చే కుట్ర జరుగుతోంది అన్నారు. మరి ఇప్పుడు పూర్తిస్థాయిలో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చెల్లెలు షర్మిల చేతికి వచ్చాయి. జగన్‌తో పాటు వైసీపీ మంత్రులు, నేతలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.