YS SHARMILA: షర్మిల భావోద్వేగం.. పీసీసీ చీఫ్‌ పదవిపై షర్మిల ఎమోషనల్

ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిలను నియమిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకే చెందిన వైఎస్ఆర్‌ కూతురు అయిన షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించడం వెనక కాంగ్రెస్.. మెగా ప్లాన్ సిద్ధం చేసి ఉంచిందనే టాక్ వినిపిస్తోంది.

  • Written By:
  • Updated On - January 16, 2024 / 08:04 PM IST

YS SHARMILA: ఏపీలో ఎలాగైనా సరే బౌన్స్‌బ్యాక్ కావాలని ఫిక్స్ అయిన కాంగ్రెస్‌.. ఆ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎక్కడ పోగొట్టుకున్నామో.. ఎలా పోగొట్టుకున్నామో.. అలాగే తిరిగి తెచ్చుకోవాలి అనే నినాదంతో జాగ్రత్తగా ఒక్కో అడుగు వేస్తోంది. దీనికోసం వైఎస్‌ షర్మిలను రంగంలోకి దింపింది. ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిలను నియమిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకే చెందిన వైఎస్ఆర్‌ కూతురు అయిన షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించడం వెనక కాంగ్రెస్.. మెగా ప్లాన్ సిద్ధం చేసి ఉంచిందనే టాక్ వినిపిస్తోంది.

Chandrababu Naidu: అంబటి పంచ్‌.. చంద్రబాబు పిటిషన్‌పై అంబటి ఆసక్తికర ట్వీట్‌

ఏపీ.. ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఉనికి నిలబడాలంటే.. పోరాడక తప్పని పరిస్ధితుల్లో షర్మిలపై అధిష్టానం నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించింది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు పీసీసీ చీఫ్‌ పదవి కట్టబెట్టడంపై షర్మిల రియాక్ట్ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్ష పదవి విషయంలో తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు నమ్మకంగా పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, ఎంపీ మాణిక్కం ఠాకూర్‌కి కూడా షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఆయనతో పాటు ప్రతీ కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు వివరించారు. తన కోసం పీసీసీ ఛీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్న గిడుగు రుద్రరాజుతో పాటు ఇతర నేతల మద్దతు కూడా కోరుతున్నానని అన్నారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలోని ఇతర నాయకులు, వారి అనుభవం, నైపుణ్యంతో తన నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తున్నానని షర్మిల రాసుకొచ్చారు. ఐతే ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిలకు అసలైన సవాళ్లు ఎదురుకావడం ఖాయం. పొత్తులు, ఎత్తులు అంటూ.. ఏపీలో పార్టీలు కత్తులు దూస్తున్న వేళ.. కాంగ్రెస్ తన ఉనికి ఎలా చాటుకుంటుంది. హస్తం పార్టీ ఘోరంగా ఫెయిల్ అయితే షర్మిల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయ్.