YS Sharmila : ఈ నెల 4న కాంగ్రెస్ లోకి షర్మిల

వైఎస్ షర్మిల... ఏపీ కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.  ఈనెల 4న తన వైఎస్సార్ టీపీని హస్తం పార్టీలోకి విలీనం చేస్తారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ లో చేరబోతున్నారు షర్మిల.  అయితే ఆమెకు ఇప్పటికిప్పుడు ఏం పదవి ఇస్తారన్న దానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి.

  • Written By:
  • Updated On - January 2, 2024 / 12:50 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు వైఎస్ షర్మిల.  అన్న జగన్ తో విబేధించి తెలంగాణకు వచ్చి వైఎస్సార్ టీపీని పెట్టారు. ఆ తర్వాత BRS సర్కార్ పై యుద్ధం ప్రకటించి… పాదయాత్రలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు షర్మిల. ఇప్పుడు జనవరి 4న కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టీపీని విలీనం చేయాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. అదే రోజు AICC అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. వైఎస్ షర్మిలతో పాటు దాదాపు 40 మంది లీడర్లు కాంగ్రెస్ లో చేరే అవకాశముంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వైఎస్ షర్మిల, పార్టీ నాయకులు ఢిల్లీకి వెళతారు.

లోటస్ పాండ్ లో షర్మిల అధ్యక్షతన వైఎస్సార్ టిపి సమావేశం జరిగింది.  చాలా మంది లీడర్లు మాత్రం ఇక్కడ పార్టీని కొనసాగించాలని ఆమెను కోరినట్టు తెలుస్తోంది. కానీ తెలంగాణ ఎన్నికలకు ముందే తన పార్టీని ఇక్కడి కాంగ్రెస్ కలపాలని షర్మిల అనుకున్నారు. కానీ అందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఎవరూ ఒప్పుకోలేదు.  దాంతో ఏపీ కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇస్తామని AICC పెద్దలు చెప్పడంతో షర్మిల ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించారు.

New Year celebrations Minister Roja : న్యూ ఇయర్ వేడుకల్లో రచ్చ చేసిన మంత్రి రోజా..

షర్మిలకు ఏం పదవి ?

ఏపీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్న వైఎస్ షర్మిలకు ఏ పదవి ఇస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.  ఏకాభిప్రాయం కుదరలేదు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా? రాజ్యసభ సభ్యత్వమా అనేది తేలాల్సి ఉంది. పీసీసీ చీఫ్ గా ఇచ్చి… రాబోయే ఎన్నికల్లో ఆమెను కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అలా కాకుండా ఇప్పుడు కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపి… తర్వాత కడప పార్లమెంట్ స్థానానికి టిక్కెట్ ఇస్తారని కూడా తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఇడుపులపాయకు వెళ్తున్నారు షర్మిల. తన కొడుకు రాజారెడ్డి పెళ్ళి ఆహ్వాన పత్రికను వైఎస్సార్ సమాధి దగ్గర ఉంచి పూజలు చేస్తారు.  బుధవారం ఇడుపులపాయ నుంచి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఆ తర్వాత 3 రోజు రాత్రి గానీ లేదంటే 4 నాడు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు షర్మిల.