YS SHARMILA: ఎక్కడా కనిపించని జగన్‌, షర్మిల మీటింగ్ ఫొటోలు.. వాటిని ఆపింది ఆయనేనా..?

ఆమె కాంగ్రెస్‌లో చేరడం వల్ల.. ఆ పార్టీ జీవం పోసుకుంటుందా.. లేచి పరుగులు పెడుతుందా అన్నది కాదు. అన్నకు వ్యతిరేకంగా చెల్లి యుద్ధానికి దిగడం.. జగన్‌ ప్రత్యర్థులకు ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది.

  • Written By:
  • Publish Date - January 4, 2024 / 02:13 PM IST

YS SHARMILA: ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇప్పుడు ఏపీ రాజకీయం గురించే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో చెల్లి కాంగ్రెస్‌లో చేరితే.. హైదరాబాద్‌ గల్లీలో ఏపీ సీఎం జగన్ కనిపించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించారు. 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఏం మాట్లాడుకున్నారన్న సంగతి ఎలా ఉన్నా.. ఢిల్లీలో చెల్లి, గల్లీలో జగన్ వ్యవహారంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం షర్మిల చుట్టే తిరుగుతున్నాయ్.

MAKARA JYOTHI: అయ్యప్ప భక్తులకు షాకింగ్ న్యూస్ ! జ్యోతి దర్శనానికి 50వేల మందికే పర్మిషన్

ఆమె కాంగ్రెస్‌లో చేరడం వల్ల.. ఆ పార్టీ జీవం పోసుకుంటుందా.. లేచి పరుగులు పెడుతుందా అన్నది కాదు. అన్నకు వ్యతిరేకంగా చెల్లి యుద్ధానికి దిగడం.. జగన్‌ ప్రత్యర్థులకు ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. దీంతో షర్మిల వ్యవహారం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. చాలా రోజుల తర్వాత.. కాదు కాదు చాలా ఏళ్ల తర్వాత అన్న జగన్‌ను కలిశారు షర్మిల. కుమారుడు రాజారెడ్డి పెళ్లికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి.. షర్మిల వెంట కనిపించారు. తాడేపల్లిలో జగన్ ఇంట్లోకి వెళ్లినప్పుడు.. బయటకు వచ్చినప్పుడు విజువల్స్‌, ఫొటోలు మాత్రమే ఉన్నాయ్ తప్ప.. తాడేపల్లి హౌస్‌లో జగన్‌తో భేటీలో ఏం జరిగిందన్న దానికి.. వీడియో కాదు కదా చిన్న ఫొటో కూడా బయటకు రాలేదు. అటు వైసీపీ కానీ.. ఇటు ఏపీ సీఎంవో కానీ.. లేదంటే వైటీపీ నుంచి కానీ.. ఒక్కటంటే ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. నిజానికి సీఎంను ఎవరైనా ప్రముఖులు కలిస్తే.. ఆ ఫొటోలు, వీడియోలను రిలీజ్‌ చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. వైసీపీ అధికారిక ట్విటర్ ఖాతాతో పాటు ఏపీ సీఎంవో కూడా.. ఆ ఫొటోలను రిలీజ్ చేస్తుంటుంది.

ఐతే జగన్, షర్మిల భేటీ ఫొటోలు మాత్రం బయటకు రాలేదు. పెళ్లి కార్డు ఇచ్చే ఫోటోల్లో పెద్ద విషయాలు కూడా ఏమీ ఉండే ఛాన్స్ ఉండదు. అయినా సరే ఈ భేటీని ఇంత రహస్యంగా ఎందుకు ఉంచారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. జగన్ ఆదేశాలతోనే ఇది జరిగి ఉంటుందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఐతే పెళ్లి కార్డు ఇవ్వటం వ్యక్తిగత విషయమని.. దీనిని కూడా అందరికీ చెప్పాలా అని వైసీపీ కేడర్ కౌంటర్ ఇస్తోంది. మరి అంతా బాగున్న రోజుల్లో.. రాఖీ కట్టిన ఫొటోలు ఎందుకు రిలీజ్‌ చేసినట్లు సార్ అని.. టీడీపీ నేతలు మళ్లీ కౌంటర్ ఇస్తున్నారు. ఏమైనా షర్మిల కాంగ్రెస్‌లో చేరిక.. జగన్‌తో భేటీ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.