Sharmila VS Avinash Reddy : షర్మిల టార్గెట్ .. అవినాశ్ రెడ్డినా..?

ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ఎన్నికలు రానున్న రోజుల్లో రసవంతంగా మారనున్నాయి. ఏపీ రాజకీయ పార్టీలు ఒక ఎత్తు అయితే.. వైఎస్ ఫ్యామిలీ (YS Family) పొలిటికల్ ఫైట్ మరో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో షర్మిల వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టి.. ఎన్నికల్లో పోటి చేయ్య కుండానే ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ఎన్నికలు రానున్న రోజుల్లో రసవంతంగా మారనున్నాయి. ఏపీ రాజకీయ పార్టీలు ఒక ఎత్తు అయితే.. వైఎస్ ఫ్యామిలీ (YS Family) పొలిటికల్ ఫైట్ మరో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో షర్మిల వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టి.. ఎన్నికల్లో పోటి చేయ్య కుండానే ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. ఇక ఎట్టకేలకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చొరవతో ఏపీ కాంగ్రెస్ (AP Congress) రాష్ట్ర అధ్యక్షురాలు పీటంను దక్కించుకుంది. వారితో విరితో ఎందుకో అని సొంత అన్ననే ఢీకొట్టేందుకు కంకణం కట్టుకుంది వైఎస్ షర్మిల.. సొంత ఫ్యామిలీలోనే ముందుగా అవినాశ్ రెడ్డిని టార్గెట్ చేసింది షర్మిల… అందుకు కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి పై వైఎస్ షర్మిల రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారని సమాచారం.

కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సూచన మేరకు షర్మిల కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. కుటుంబసభ్యులు, సన్నిహితులతో చర్చించి మరో రెండు రోజుల్లో ఇడుపులపాయలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ఘాట్ వద్ద కడప ఎంపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని సమాచారం. చిన్నాన్న వైఎస్ వివేకా (YS Viveka) హత్య కేసులో నిందితుడిగా వున్న అవినాశ్‌ను ఓడించాలంటే.. షర్మిల సరైన అభ్యర్థి అని కడప ప్రజలు చర్చించుకుంటున్నారు.

S.SURESH