YS SHARMILA: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు అందుకున్న షర్మిల దూకుడు మీద కనిపిస్తున్నారు. హోదా అంటూ ఢిల్లీలో నిరసనలు.. అవినీతి అంటూ ఏపీ గల్లీల్లో నిలదీతలు.. అనుకున్నదానికి మించి షర్మిల జోష్ కనిపిస్తోంది ఈసారి! ఏపీ ప్రభుత్వాన్ని, అన్న జగన్‌ను టార్గెట్ చేసుకుని రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు షర్మిల. కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఏపీకి సంబంధించి చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని.. బీజేపీని చూసి జగన్ భయపడుతున్నారని నిలదీస్తున్నారు.
Ponnam Prabhakar: ఖరీదైన గిఫ్ట్ ! కొత్త వివాదంలో మంత్రి పొన్నం.. ఆ కారు మెడకు చుట్టుకుంటోందా ?
ఇక్కడితో ఆగితే ఇంకోలా ఉండేదేమో.. ఆ తర్వాత షర్మిల చేస్తున్న కామెంట్లే కమలం పార్టీకి కోపం తెప్పిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టారంటూ బీజేపీ టార్గెట్‌గా షర్మిల చేస్తున్న విమర్శలు ఇప్పుడు కమలం పార్టీ పెద్దలకు కోపం తెప్పిస్తున్నాయ్. షర్మిల వ్యాఖ్యలపై ఆ పార్టీ చాలా సీరియస్‌గా ఉందనే చర్చ జరుగుతోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజే.. కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మణిపూర్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు షర్మిల. ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని పార్టీలు మర్చిపోయిన ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీలో దీక్ష చేపట్టడం.. కాంగ్రెస్ నేతలతో పార్లమెంట్‌లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టించడంలాంటి విషయాలను బీజేపీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఏపీలో ఏ పార్టీ కూడా బీజేపీ మీద విమర్శలు చేయడానికి ధైర్యం చేయడం లేదు.
వ్యక్తిగత విమర్శలు కనిపిస్తాయ్ తప్ప.. కేంద్రం మీద ఏనాడూ, ఏ పార్టీ టార్గెట్ పెట్టినట్లు కనిపించలేదు. అలాంటిది షర్మిల మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ప్రాసెస్‌లో కేంద్రాన్ని లాగుతున్నారు. వివాదాస్పద అంశాలను మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారు. ఇది బీజేపీకి ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది. దీంతో షర్మిలకు రాజకీయంగా కౌంటర్ ఇచ్చేందుకు కమలం పార్టీ రెడీ అవుతుందని టాక్. దీంతో పొలిటికల్‌గా షర్మిలకు రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది.