YS SHARMILA: షర్మిల ముందు కాంగ్రెస్‌ 3 ఆప్షన్లు! కడప ఎంపీగా పోటీ..?

తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని.. ఏపీలో ఎంటర్ అవనని పదేపదే చెప్పిన షర్మిల.. కాంగ్రెస్‌లో చేరేందుకు ఎలా అంగీకరించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. షర్మిల ముందు కాంగ్రెస్ అధిష్టానం మూడు ఆప్షన్లు ఉంచినట్లుగా తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - January 1, 2024 / 05:50 PM IST

YS SHARMILA: షర్మిల కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అయింది. జనవరి 4న హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్న షర్మిల.. ఏపీలో స్టార్ క్యాంపెయినర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్ యాక్టివ్ అయితే ఏ పార్టీ మీద ప్రభావం పడుతుంది.. ఎవరి ఫేట్‌ మారుతుందన్న సంగతి పక్కన పెడితే.. ఇప్పుడో చర్చ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని.. ఏపీలో ఎంటర్ అవనని పదేపదే చెప్పిన షర్మిల.. కాంగ్రెస్‌లో చేరేందుకు ఎలా అంగీకరించారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

REVANTH REDDY: సంక్రాంతి తర్వాతే కేబినెట్ విస్తరణ.. ఆ పార్టీల ఎమ్మెల్యేల కోసం 3 రిజర్వ్..!

షర్మిల ముందు కాంగ్రెస్ అధిష్టానం మూడు ఆప్షన్లు ఉంచినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి నచ్చడంతో.. ఏపీలో కాంగ్రెస్ తరఫున ప్రచారానికి షర్మిల సిద్ధం అయ్యారనే ప్రచారం జరుగుతోంది. కర్ణాటక లేదా తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ అయి పార్టీ పగ్గాలు అందుకోవటంతో పాటు.. పార్టీ పగ్గాలు అందుకుని కడప లోక్‌సభకు పోటీచేయటం.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులై తర్వాత రాజ్యసభకు నామినేట్ అవడం.. ఈ మూడు ఆప్షన్లను షర్మిల ముందు కాంగ్రెస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూడింట్లో దేన్ని కోరుకుంటారో చెప్పండి అంటూ.. చాయిస్‌ షర్మిలకే వదిలేసినట్లు తెలుస్తోంది. మరి షర్మిల ఈ మూడు ఆప్షన్లలో దేనికి సై అంటారన్నది ఆసక్తికంగా మారింది. ఐతే షర్మిల పార్టీలో చేరిన తర్వాత.. కాంగ్రెస్‌ భారీ వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఏపీలోనూ సీపీఐ, సీపీఎంతో కలిపి పొత్తు పెట్టుకోవాలని అధిష్టానం పెద్దలు సూచించబోతున్నారట.

దీంతో ఏపీలో ఇండియా కూటమికి తలుపులు తెరుచుకున్నట్లు అవుతుంది. ఇక అటు పార్టీని బలోపేతం చేయటంలో భాగంగా… వైసీపీ, టీడీపీలోని అసంతృప్తులకు గాలమేయాలని ప్లాన్ చేస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. రెండు పార్టీల్లోని అసంతృప్తులతో టచ్ లోకి వెళ్లి.. పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఆఫర్ చేస్తే చాలామంది పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయన్నది కాంగ్రెస్ అధిష్టానం అంచనా. ఏమైనా షర్మిలను ముందు పెట్టి.. ఏపీలో కాంగ్రెస్ భారీ ప్లాన్లు సిద్ధం చేస్తోంది. ఇవన్నీ వర్కౌట్ అవుతాయా.. కాంగ్రెస్‌ బౌన్స్‌బ్యాక్ అవుతుందా అంటే.. కాలమే సమాధానం చెప్పాలి మరి.