YS SHARMILA: దమ్ముంటే మోదీని ఇది అడుగు.. జగన్‌కు షర్మిల సవాల్‌..

గతంలో టీడీపీ, ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్నా.. ఒక్కరు కూడా విభజన హామీలపై పోరాడలేదన్నారు షర్మిల. జగన్, చంద్రబాబు ఇద్దరూ.. రాష్ట్ర ప్రయోజనాలను బీజీపీకి తాకట్టు పెట్టారరని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు.

  • Written By:
  • Updated On - February 7, 2024 / 04:15 PM IST

YS SHARMILA: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల స్పీడ్‌ పెంచారు. ఇప్పటికే వరుస మీటింగ్‌లతో ఏపీలో కాంగ్రెస్‌కు తిరిగి ప్రాణం పోస్తున్న షర్మిల ఇప్పుడు జగన్‌, చంద్రబాబులు ఓపెన్‌ లెటర్‌ రాశారు. అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్‌ సమావేశారు జరుగుతున్న నేపథ్యంలో.. విభజన హామీలపై కేంద్రంపై పోరాడాలంటూ కోరారు. వ్యక్తిగత లాభాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టాలని చూస్తే కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరకోదంటూ వార్నింగ్‌ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడించింది.

Dharmana Krishna Das: ధర్మాన క్రిష్ణ దాస్‌కి ఏమైంది ? కోరి తెచ్చుకున్న వర్గ పోరు !

గతంలో టీడీపీ, ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్నా.. ఒక్కరు కూడా విభజన హామీలపై పోరాడలేదన్నారు షర్మిల. జగన్, చంద్రబాబు ఇద్దరూ.. రాష్ట్ర ప్రయోజనాలను బీజీపీకి తాకట్టు పెట్టారరని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని అసెంబ్లీ వేదికగా చర్చించాలన్నారు. విభజన హక్కులపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ హోదా సాధించడంలో 2014 నుంచి 2019 దాకా బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు విఫలయ్యారని షర్మిల విమర్శించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా ఏపీకి ఒరిగిందేమీ లేదన్నారు. హోదా కావాలని ఒకసారి, అవసరం లేదని మరోసారి మాట మారుస్తూ ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లారంటూ రాసుకొచ్చారు. జగన్, చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. ఇప్పటికైనా విభజన హామీలపై పోరాడటానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని జగన్, చంద్రబాబును కోరారు.

ప్రతిపక్షాలన్నీ ఏకమై, రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రంకోసం నిలబడి, కలబడాలని పిలుపునిచ్చారు. అఖిల పక్షాన్ని తీసుకువెళ్లి ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి చేయడానికి తమతో కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు షర్మిల. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటుతున్నా.. ఇంత వరకు రాజధాని నిర్మించకుండా ప్రజలకు జగన్, చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పటి నుంచి రెండు పార్టీలు చేసిన ప్రతీ అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామంటూ వార్నింగ్‌ ఇచ్చారు షర్మిల.