JAGAN SEAT : బాబుతో జగన్ తాడో పేడో… అసెంబ్లీలో ఆ మూల సీటేనా ?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైంది వైసీపీ (YCP). కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈనెల 21, 22 ల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Elections) జరగబోతున్నాయి.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైంది వైసీపీ (YCP). కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈనెల 21, 22 ల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Elections) జరగబోతున్నాయి. ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు చేపట్టబోయే గోరంట్ల బుచ్చయ్య చౌదరి… కొత్త సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. మరి ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ వస్తారా ? పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారా అనే హాట్ టాపిక్ నడుస్తోంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కొత్తగా ఎన్నికైన ప్రతి ఒక్క ఎమ్మెల్యే హాజరు కావాల్సిందే. అందరూ శాసన సభ్యులుగా ప్రమాణం చేయాలి. మొత్తం 175 మంది ఒకే రోజు ప్రమాణం చేయడం కుదరదు… అందుకే రెండు రోజుల పాటు సభ నడవనుంది. ఈ సభకు జగన్ హాజరవుతారా లేదా అన్న డౌట్స్ వచ్చాయి. అయితే సభలో పాల్గొని ప్రమాణం చేయాలని ఆయన డిసైడ్ అయినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ సీటు ఎక్కడ అన్నదానిపై డిస్కషన్ నడుస్తోంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు… అదే ఉంటే… అసెంబ్లీలో మొదటి వరుసలోనే చోటు దక్కేదు. మరి ఇప్పుడు ఆయనకు సీటు ఎక్కడ ఇస్తారు అంటే… జగన్ ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే… వైసీపీ శాసన సభ్యులు తమ సీఎల్పీ లీడర్ గా ఎన్నుకోవచ్చు. అయినా సరే… జగన్ కు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేదు. అందువల్ల అసెంబ్లీలో చివరి సీటు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అసెంబ్లీలో సీట్లు ఖరారు చేసే అధికారం స్పీకర్ కే ఉంటుంది. కొత్తగా ఆ పోస్టులోకి చింతకాలయ అయ్యన్నపాత్రుడు రాబోతున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం అయ్యన్నకు చుక్కలు చూపించింది. గత ఐదేళ్ళలో ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిన సందర్భాలు అనేకం జరిగాయి. పైగా తన బూతులతో నిత్యం వివాదాల్లో ఉంటారన్న పేరు కూడా ఉంది. అందువల్ల అయ్యన్న నుంచి జగన్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్న ఆశ ఏ మాత్రం లేదు. మనకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు… అయినా ప్రజా సమస్యల మీద పోరాడాలి అంటూ తమ ఎమ్మెల్యేలకు జగన్ చెప్పారంటే… రాబోయే రోజుల్లో చుక్కలు కనిపిస్తాయని మాజీ సీఎంకి ముందే అర్థమైనట్టుంది.

అసెంబ్లీ సమావేశాల కంటే ముందు మొదట పులివెందులలో పర్యటించాలని అనుకున్నారు జగన్. కానీ సెషన్స్ ప్రీపోన్ కావడంతో ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈనెల 20న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొంటున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత పులివెందులకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు జగన్. అయితే ఏపీ అసెంబ్లీలో ఈనెల 21న ఫస్ట్ డే జగన్ ఎంట్రీ ఎలా ఉంటుంది… దానికి టీడీపీ సభ్యులు ఇచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.