YSR JAYANTHI : ఒకే వేదికపై విజయమ్మ, సోనియా.. జగన్ లేకుండానే వైఎస్సార్ జయంతి

ఏపీలోని విజయవాడలో ఈనెల 8న వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు APCC అధ్యక్షురాలు షర్మిల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ ని కూడా పిలిచారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ కూడా పాల్గొంటున్నారు. ఆ రోజు సభా వేదికపై సోనియా, విజయమ్మ పక్క పక్కనే కూర్చోవడం హాట్ టాపిక్ గా మారింది.

వైఎస్ మరణం తర్వాత తన బిడ్డ జగన్ ని ముఖ్యమంత్రి చేయలేదని విజయమ్మ కాంగ్రెస్ పెద్దలపై మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో జగన్ కొత్త పార్టీ పెడితే… విజయమ్మ, షర్మిల ప్రచారం చేశారు. సోనియా, రాహుల్ కోటరీని తిట్టిన తిట్టు తిట్టకుండా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు విజయమ్మ. తన సోదరుడు జగన్, తల్లి విజయమ్మను అవమానించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనే షర్మిల ఇప్పుడు గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. పీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న షర్మిల… వైఎస్సార్ జయంతిని కాంగ్రెస్ పార్టీ పేరున కాకుండా… తన సొంత కార్యక్రమంలాగా వాడుకుంటున్నారు. సోనియా, రాహుల్, ఖర్గేతో పాటు సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ పెద్దలందర్నీ ఈ ప్రోగ్రామ్ కి ఆహ్వానించారు. వైఎస్సార్ బిడ్డగా ఈ కార్యక్రమం సక్సెస్ చేసి… ఏపీలో తన మార్క్ చాటాలన్నది షర్మిల ప్రయత్నం.

ఈ వేదిక మీద కాంగ్రెస్ పెద్దలతో కలసి చాలా యేళ్ళ తర్వాత షర్మిల తల్లి విజయమ్మ కనిపించబోతున్నారు. కాంగ్రెస్ తన కుటుంబానికి ద్రోహం చేసిందని ఒకప్పుడు తిట్టిపోసిన విజయమ్మ… ఇప్పుడు సోనియాగాంధీ పక్కనే కూర్చోబోతున్నారు. ఇలాంటి పరిస్థితి విజయమ్మకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ షర్మిల ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం కావడంతో… రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రోగ్రామ్ కి మాజీ సీఎం జగన్ ని మాత్రం ఇంకా పిలవలేదు. ఆయన్ని షర్మిల పిలుస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. అయితే వైస్సార్ జయంతి కార్యక్రమానికి సోనియా, రాహుల్ హాజరు అవడం డౌట్ గానే ఉందంటున్నారు. అటెండ్ అయితే మాత్రం విజయమ్మ ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.