YATRA 2: యాత్ర 2 సినిమా కోసం అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సమావేశాలు వాయిదా..

వైఎస్ జగన్ బయోపిక్ ఆధారంగా యాత్ర 2 సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 8, గురువారం విడుదలైంది. దీంతో ఏపీలోని వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు యాత్ర 2 చూసేందుకు థియేటర్లకు వెళ్లిపోయారు.

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 04:43 PM IST

YATRA 2: ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బుధవారమే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. షెడ్యూల్ ప్రకారం.. గురువారం కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగాల్సి ఉంది. అయితే, గురువారం అసెంబ్లీ కొనసాగలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీకి హాజరు కాలేదు. కారణం.. యాత్ర 2 సినిమా అని తెలుస్తోంది. వైఎస్ జగన్ బయోపిక్ ఆధారంగా యాత్ర 2 సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 8, గురువారం విడుదలైంది.

Upasana Kamineni: మండిపాటు.. ఉపాసనపై పవన్ ఫ్యాన్స్ ఫైర్

దీంతో ఏపీలోని వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు యాత్ర 2 చూసేందుకు థియేటర్లకు వెళ్లిపోయారు. అసెంబ్లీకి ఎగ్గొట్టి మరీ సినిమాకు వెళ్లడం విమర్శలకు దారితీస్తోంది. ఒకవైపు షెడ్యూల్ ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యేలు గురువారం ఉదయం అసెంబ్లీకి వెళ్లారు. కానీ, అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలెవరూ కనిపించలేదు. దీంతో సభలో ఉన్న టీడీపీ సభ్యులు కూడా వాకౌట్ చేసి వెళ్లిపోయారు. అంతకుముందు కోరం లేదని సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే, ఒక సినిమా కోసం ఎమ్మెల్యేలు శాసన సభకు డుమ్మా కొట్టడం ఏంటని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. శాసనసభ చరిత్రలో ఇదో చీకటి రోజు అని అభివర్ణించారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన యాత్రకు సీక్వెల్‌గా రూపొందింది యాత్ర 2. ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించగా, వైఎస్ జగన్ పాత్రలో తమిళ యువనటుడు జీవ కనిపించారు. అయితే రాజకీయంగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విడుదలైన ఈ చిత్రం.. వైసిపికి ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈ సినిమాను రాజకీయ కారణాలతోనే తెరకెక్కించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.