సీట్‌ ఫర్‌ సేల్‌

ఏపీలో మొన్నటి వరకూ ఓట్ల పండగ నడిస్తే ఇప్పుడు మాత్రం సీట్ల పండగ నడుస్తోంది. ఎమ్మెల్సీ, రాజ్య సభ సీట్లు త్యాగం చేసేందుకు రెడీగా ఉన్న వాళ్లకు నిజంగా ఇది పండగే.

  • Written By:
  • Updated On - August 31, 2024 / 06:30 PM IST

ఏపీలో మొన్నటి వరకూ ఓట్ల పండగ నడిస్తే ఇప్పుడు మాత్రం సీట్ల పండగ నడుస్తోంది. ఎమ్మెల్సీ, రాజ్య సభ సీట్లు త్యాగం చేసేందుకు రెడీగా ఉన్న వాళ్లకు నిజంగా ఇది పండగే. సీట్లు అమ్ముకుంటే ఆ స్థాయిలో భారీ ముడుపులు ముడుతున్నాయి మరి. చేయాల్సిందిల్లా పార్టీ మారి పదవికి రాజీనామా చేయడం. నియోజకవర్గంలో అనుచరులు, నమ్ముకున్నవాళ్లు అడిగితే.. సింపుల్‌గా నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పడంలేదు అని చెప్పడం. ఇప్పటికే ఇలా ఇద్దరు రాజ్యసభ ఎంపీలు వైసీపీ చేజారిపోయారు. ఇప్పుడు మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా చేజారిపోయేందుకు రెడీగా ఉన్నారు. ఆరేళ్ల పదవీకాలం ఉన్న రాజ్యసభ సీటు వదులుకుంటే 100 కోట్ల వరకూ ముట్టచెప్పేందుకు రెడీగా ఉన్నారని టాక్‌ నడుస్తోంది. అలాగే రెండేళ్ల పదవీకాలం ఉన్న రాజ్యసభ సీటు అమ్ముకుంటే 25 కోట్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకుంటే 25 కోట్ల వరకు ముడుపులు ముడుతున్నాయట. ఇప్పటికే పోతుల సునీతా, కళ్యాణ చక్రవర్తి, పద్మశ్రీ… ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి జంప్‌ ఐపోయారు. వాళ్ల పదవులు వదులుకుంటే భారీ మొత్తం వాళ్లకు చేరనుంది. అలా కాకుండా టీడీపీలో చేరిన తరువాత కూడా అదే పదవిలో కంటిన్యూ అవ్వాలి అంటే రూపాయి కూడా రాదు. కానీ అధికార పార్టీలో పదవి కంటిన్యూ అవుతుంది. మండలిలో టీడీపీ బలం పెరుగుతుంది. పదవులు వదులుకునేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ నుంచి సానా సతీష్‌, గల్లా జైదేవ్‌ రాజ్యసభ సభ్యత్వం కోసం రెడీగా ఉన్నారు. మోపీదేవి వదిలేసిన స్థానం… ఈ ఇద్దరిలో ఒకరికి కన్ఫాం కానుంది. బీద మస్తాన్‌ సీటు మాత్రం ఆయనకే ఇచ్చేస్తారు. దీంతో ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా గెలుస్తారు. మోపీదేవి మండలిలో ఎమ్మెల్సీగా వెళ్లిపోతారు. ఆయన కోసం ఎమ్మెల్సీ సీట్లు కూడా ఖాళీ చేస్తున్నారు. ఇలా ఎటు నుంచి చూసినా అంతా డబ్బే ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు రాజ్యమేలుతోంది. ఎమ్మెల్సీ సీటు వదులుకున్నా, ఎంపీ సీటు వదులుకున్నా వాళ్ల ఇంట్లో కాసుల వర్షం కురవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.