Tech companies Jobs cut: 4 నెలల్లో 70 వేల ఉద్యోగాలు ఫట్ … టెక్ కంపెనీల్లో భారీగా ఫైరింగ్

ప్రపంచంలోని దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపును ఇంకా కంటిన్యూ చేస్తున్నాయి. కరోనా తర్వాత నుంచి మొదలైన ఫైరింగ్ పర్వం ఇంకా కొనసాగుతోంది.

 

 

 

ప్రపంచంలోని దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపును ఇంకా కంటిన్యూ చేస్తున్నాయి. కరోనా తర్వాత నుంచి మొదలైన ఫైరింగ్ పర్వం ఇంకా కొనసాగుతోంది. ఈ ఏడాది గడచిన నాలుగు నెలల్లో ఏకంగా 70 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. గూగుల్, అమెజాన్, యాపిల్, టెస్లా లాంటి దిగ్గజ కంపెనీల్లో కూడా భారీగా ఉద్యోగులను తప్పించారు.

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) కి చెందిన కార్ల కంపెనీ టెస్లా (Tesla) లోనూ వేల మంది ఉద్యోగులను తొలగించారు. కార్ల అమ్మకాలు పడిపోవడంతో ఖర్చులు తగ్గించుకోడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ ఆఫీసుల్లో 10 శాతం ఉద్యోగులను తొలగించాలని టెస్లా డిసైడ్ అయ్యింది. ఇక యాపిల్ (Apple) గ్రూపు కూడా 614 మందిని తప్పించింది. వీళ్ళల్లో కొందరు సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రాజెక్టులో ఉన్నారు. ఆ ప్రాజెక్టును యాపిల్ రద్దు చేయడంతో అందులో పనిచేసేవాళ్ళు కొలువులు కోల్పోయారు.

ఇక గూగుల్ కూడా భారీగానే తప్పిస్తోంది. పైథాన్, ఫ్లుట్టర్, డార్ట్ లపై పనిచేసే వారిని గూగుల్ ఇంటికి పంపేసింది. అయితే వాళ్ళకి తమ కంపెనీలోనే ఇతర ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోడానికి అవకాశం కల్పించినట్టు గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు. అమెజాన్ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ లో పనిచేసే వాళ్ళల్లో వందల మందిపై వేటు వేసింది. కరోనా టైమ్ లో ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫామ్స్ లో ఒక్క వెలుగు వెలిగిన ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ కూడా 500 మంది ఎంప్లాయీస్ ని తొలగించింది. కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే చాలామందిని తప్పించింది. ఇవి కాకుండా ఇంటెల్, టెలినార్, హెల్తీఫై, ఓలా క్యాబ్స్ లాంటి సంస్థలు కూడా ఉద్యోగులను తొలగించాయి.