Brain Vacation: అటెన్షన్ ప్లీజ్.! బ్రెయిన్ వెకేషన్ ఉండగా.. టెక్షన్ ఎందుకు దండగ..!

ఏ పని చేసేందుకు ఉత్సాహం కనిపించడం లేదా..? మిమ్మల్ని మీరే మర్చిపోతున్నారా..? ఆఫీసులో ఒక పనికి బదులు మరోకటి చేసి బాస్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? మీ మైండ్ కి ఏమీ తోచడం లేదా..? మనసుకు ప్రశాంతత లభించడం కష్టంగా ఉందా..? అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే. ఎలాంటి డాక్టర్ వద్దకు వెళ్ళనవసరం లేకుండా ప్రకృతి ఒడిలో ట్రీట్మెంట్. అలాగని ఆయుర్వేద వైద్యం అస్సలు కాదు. మరేంటి..? అది బ్రెయిన్ వెకేషన్. ఏంటి బ్రయిన్ వెకేషనా..? ఈ బ్రైన్ వెకేషన్ అంటే ఏమిటి, దీని వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Updated On - June 30, 2023 / 07:50 PM IST

సాధారణంగా మనం రకరకాల పనుల్లో పడి మన మనసుకు కాస్త స్వేచ్ఛను అందించడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దీని ఎఫెక్ట్ మన మెదడుపై ప్రభావం చూపుతుంది. తద్వారా చేసే పనిలో నాణ్యత లోపిస్తుంది. ఇలా లోపించకుండా ఉండేందుకు సరికొత్త ప్రయోగాన్ని చేశారు కొందరు నిపుణులు. 2017 డచ్ నగరంలో నిర్వహించిన ఓ సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. అయినప్పటికీ వారి మనసుకుదుట పడలేదు అని ఈ సర్వేలో తేలింది. దీనికి గల కారణం మనం పేరుకే వెకేషన్ అని విహారయాత్రలకు, విదేశీ టూర్లకు వెళుతూ ఉంటాము. కానీ మనసు, మెదడు మాత్రం మనం చేసే పనిలో నిమఘ్నమౌతుంది. అలా ఎన్ని టూర్లు వెళ్లినా డబ్బులు ఖర్చే తప్ప దండీ రిలాక్సేషన్ రాదని తెలిసింది.

విహారంలోనూ పనిఆలోచనలే..

ప్రస్తుత యుగంలో ఆధునికత గంగానదిలా పరవళ్లు తొక్కుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా సంస్థలో పనిచేసే ఉద్యోగులకు రెండు రోజులు వరస సెలవులు దొరకడం చాలా కష్టం అని చెప్పాలి. ఇలాంటి విభిన్న పరిస్థితుల్లో పనిని అలక్ష్యం చేయకూడదు, విహారాన్ని అశ్రద్ధ చూపకూడదు. అందుకే విహారంలో వృత్తిని చేస్తూ తమ కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తారు. ఇలా చేసినప్పటికీ వారి బ్రైన్ నుంచి ఒత్తిడి తగ్గదు. దీనికి కారణం విహారం అనుకుని కంపెనీ మైల్స్ కి రిప్లే ఇవ్వడం, వారు చెప్పిన పనిలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసి పంపినట్లు కాల్స్ లో మాట్లాడటం, ఇలా పని చుట్టూ ఆలోచిస్తూ కాలక్షేపం చేశారు. అందుకే మెదడు రిలాక్స్ అవ్వదని అధ్యయనంలో వెల్లడైంది.

బ్రయిన్ వెకేషన్ అంటే..

నిజానికి బ్రెయిన్ వెకేషన్ అంటే మనం వెకేషన్లోకి వెళ్లడం కాదు. మన మనసు, మెదడు అక్కడ చుట్టూ ఉన్న పరిసరాలను అనుభూతి చెందడం. తద్వారా కొత్త ఆలోచనలు వెల్లివిరుస్తాయి అంటున్నారు నిపుణులు. దీనికి నిదర్శనంగా మన మాట తీరు, నడవడి, తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతాలు సృష్టిస్తాయట. ఎందుకిలా మార్పు తెలియని మార్పు మనలో వస్తుందో కూడా వివరించారు. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణానికి తగ్గట్లు మన ప్రవర్తన ఉంటుంది. అలాగే ఆహారపు అలవాట్లలో కొంత మార్పు కనిపిస్తుంది. ప్రయాణంలో సరికొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారి అనుభవాలు, మీ అనుభవాలు పంచుకోగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా తెలియని విషయాలు తెలుసుకునేందుకు, తెలిసిన విషయాలు పంచుకునేందుకు ఒక వేదిక దొరుకుతుంది. అప్పుడు మన బ్రయిన్ ఒత్తిడి కరిగించుకుని సరికొత్తగా ఎనర్జీ నింపుకుంటుంది.

Brain Vacation Trip

ఎక్కడికి వెళ్లాలి..

ఈ వెకేషన్ ను మామూలు ప్రాంతాల్లో కాకుండా మనకు కొత్త, వింత అనుభూతిని ఇచ్చే ప్రాంతాలను ఎంచుకోవాలి. సముద్రాలు, వాటి చుట్టూ ఉండే ప్రదేశాలు, కొండలు, అడ్వెంచర్లు, ట్రక్కింగ్ అంటే ఒక చోటు నుంచి మరో చోటకు మనమే పెద్ద వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లడం. క్యాంపింగ్ అంటే ఒక ప్రశాంతమైన ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ చిన్న గూడారం లాంటిది వేసుకొని ప్రకృతిలో దొరికే వాటితో వంట వండుకొని తినడం. స్టార్ గేజింగ్ అంటే రాత్రి పూట ఆకాశం, నక్షత్రాలు అందంగా మనకు చేతికి అందేంత దూరంలో ఉండేలా ప్రాంతాన్ని ఎన్నుకోవాలి. ఫ్రూట్ ప్లకింగ్ ఇది మనందిరికీ తెలిసినదే. బాల్యంలో చాలా వరకూ అందరూ చేసిందే. ఒక పెద్ద పండ్ల తోటను ఎన్నుకొని అక్కడ పండ్లు చేత్తో కోసేందుకు ప్రయత్నం చేయడం. యానిమల్ ట్రైల్ ఎక్స్ప్లోరేషన్ అంటే జంతువులు వాటి జీవన విధానం ఎలా ఉంటుందో మన కళ్లతో ప్రత్యక్షంగా చూడటం. పైన తెలిపిన ప్రాంతాలైతే చాలా గొప్పగా ఉంటాయంటున్నారు బ్రయిన్ వెకేషన్ ఎక్స్ ఫర్ట్స్.

మన దేశంలో అమలు
ఇలాంటి వెకేషన్స్ కి కొన్ని ప్రైవేట్ కంపెనీలు తలపులు తెరిచి ఉంచాయి. ముఖ‌్యంగా సాప్ట్ వేర్ కంపెనీలు వీటిని ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే ఈ ట్రెండ్ ప్రాశ్చాత్య దేశాల్లో అమలులో ఉంది. మన దేశంలో కూడా ఇలాంటి వాటిని ప్లాన్ చేసేందుకు కొన్ని టూరిస్ట్ సంస్థలు ముందుకు వచ్చాయి. బెంగళూరు, నొయిడా, చెన్నై లాంటి మహానగరాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. నెలకు లేదా మూడు నెలలకు ఒకసారి ఏదో ఒక అడ్వంచర్ కి గురిచేసే ప్యాకేజితో ఉద్యోగులను ఆకర్షిస్తూ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని ఐటీ పరిశ్రమలైతే స్వయంగా తమ ఎంప్లాయిస్ కి ఇలాంటి వెకేషన్స్ కి వెళ్లేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీనికి చాలా మంది స్టార్టప్ కంపెనీల వారు ముందుకు వస్తున్నారు. తద్వారా ఉద్యోగులు తమ పని ఒత్తిడిని అధిగమించి హాయిగా అటు వృత్తి పంరంగా, సంసార పరంగా జీవనం సాఫీగా నెట్టుకొస్తున్నారు.

T.V.SRIKAR