Advance Tax: అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారా..? రేపే చివరి తేదీ.. లేకుంటే భారీ పెనాల్టీ..

అంచనా వేసిన ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను రూ.10 వేలు అంత కన్నా ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. వ్యాపారులు, ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు.. ఇలా ప్రతి ఒక్కరూ చెల్లించాల్సి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - December 14, 2023 / 06:03 PM IST

Advance Tax: అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు గడువు మరో రోజుతో ముగియనుంది. మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు చివరి గడువు డిసెంబర్ 15. ఒకవేళ పన్ను చెల్లింపు ఆలస్యమైతే భారీగా పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. నిబంధనల ప్రకారం.. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారిలో చాలా మంది అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంచనా వేసిన ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను రూ.10 వేలు అంత కన్నా ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి.

Padi Kaushik Reddy: అనర్హత వేటు తప్పదా.. కౌశిక్‌ రెడ్డి మీద ఈసీకి ఫిర్యాదు..

వ్యాపారులు, ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు.. ఇలా ప్రతి ఒక్కరూ చెల్లించాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్ సాధారణ పన్ను చెల్లింపు కంటే భిన్నంగా ఉంటుంది, దీనిని ఒక్కసారిగా కాకుండా విడతల వారీగా చెల్లించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో అడ్వాన్స్ చెల్లింపు గడువు ముగిసింది. ఇప్పుడు 2023-24కు సంబంధించి మూడో విడత అడ్వాన్స్ చెల్లింపు చేయాలి. ఉద్యోగుల విషయానికి వస్తే తాము పని చేస్తున్న కంపెనీ యాజమాన్యాలు వేతనాల నుంచి టీడీఎస్ కట్ చేస్తాయి. కాబట్టి ప్రత్యేకంగా వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగం కాకుండా.. ఇతర మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్నట్లయితే మాత్రం నిబంధనల ప్రకారం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 15లోగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించలేకపోతే దానిపై ఐటీ శాఖ సెక్షన్ 234సీ ప్రకారం 1 శాతం వడ్డీని జరిమానాగా వసూలు చేస్తుంది.

సెక్షన్ 234బీ ప్రకారం ఆర్థిక సంవత్సరం చివరి వరకు చెల్లించిన ముందస్తు పన్ను, మొత్తం పన్నులో 90 శాతం మించకపోయినా లేదా పూర్తిగా చెల్లించకపోయినా బకాయి ఉన్న పన్ను మొత్తంపై నెలకు 1 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. అలాగే.. సెక్షన్ 234ఏ ప్రకారం.. చివరి తేదీ తర్వాత పన్ను చెల్లిస్తే బకాయిపడ్డ పన్ను మొత్తంపై నెలకు 1 శాతం వడ్డీని జరిమానాగా కట్టాల్సి ఉంటుంది. వ్యాపారం లేదా వృత్తి నుంచి ఎలాంటి ఆదాయం లేని సీనియర్ సిటిజన్లు ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్ ట్యాక్స్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించవచ్చు.