ఇప్పుడు చాలా వరకూ సినిమాలను అమెజాన్ తన వేదికపైనే విడుదల చేసేందుకు సిద్దమైంది. వెబ్ సీరిస్ ల విషయానికొస్తే నెట్ ఫ్లిక్స్ ముందంజలో ఉంది. ప్రతి ఒక్కరూ థియేటర్లకు వెళ్లి చూసేందుకు సుముఖత చూపించడంలేదు. సినిమా విడుదలైన నెలకు అమెజాన్ లో వస్తుందన్న ధీమాతో ఇంట్లోనే కూర్చొని చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీనిని అదునుగా భావించిన అమెజాన్ వీక్షకులను క్యాష్ చేసుకునేందుకు కంకణం కట్టుకుంది.
ఒకప్పుడు అమెజాన్ బేసిక్ వన్ మంత్ ప్లాన్ ధర రూ. 179 గా ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ. 299 చేసింది. అంటే ఒక్కసారిగా రూ. 120 పెంచేసింది. ఇప్పుడు కొత్తగా మెంబర్ షిప్ తీసుకోవాలంటే రూ. 299 చెల్లించాలనమాట. అదే మూడు నెలల ప్లాన్ విషయానికొస్తే గతంలో రూ. 499 ఉండేది. తాజాగా పెరిగిన ధర రూ. 599 కి చేరుకుంది అంటే రూ. 100 పెరిగింది. ఇక ఒక సంవత్సరకాలానికి సంబంధించి మొదట్లో రూ. 999 ఉన్న సబ్ స్క్రిప్షన్ ధర ఏకంగా రూ. 500 పెరిగి రూ. 1499 కి చేరుకుంది. దీని ప్రభావం మిగిలిన వాటిపై కూడా పడే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.
అమెజాన్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లో ఇప్పటికే ఉన్నవారు.. అలాగే ఆటో రిన్యూవల్ ప్లాన్ ను యాక్టివ్ చేసుకున్న వారు పాత ధరలకే ప్రైమ్ వీడియోలను చూసే సదుపాయం కల్పించింది. ఈ ఏడాది చివర వరకూ పాత సబ్ సబ్ స్క్రిప్షన్ ధరలకే అందుబాటులో ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఇప్పుడు పెంచిన కొత్త ధరలతో తీసుకోవల్సి ఉంటుంది. అది పాతవారైనా కొత్త వారైనా ఎలాంటి మినహాయింపు ఉండదు.
T.V.SRIKAR