గతంలో కొందరు వ్యాపార నిపుణులు, విశ్లేషకులు ఊహించిన విధంగానే అంబానీ పావులు కదుపుతున్నారని చెప్పాలి. ఎందుకంటే రిలయన్స్ గ్రూప్ కి సంబంధించిన జియో మూవీస్ ను ఉచితంగా ఇచ్చినట్లే ఇచ్చి త్వరలో వినియోగదారుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేయనున్నట్లు సమాచారం. అయితే గతంలో ఐపీఎల్ మ్యాచులను ఉచితంగా అందిస్తాం అన్న ప్రకటనకు కట్టుబడి ఉండి.. ఈ సీజన్ తరువాత చార్జీలు ముక్కు పిండి వసూలు చేసే అవకాశం ఉంది. ఈ స్ట్రీమింగ్ వేదికను డబ్బులు చెల్లించి ఉపయోగించునే వారికోసం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలను, సినిమాలను, వెబ్ సిరీస్ లను, మ్యూజిక్ తోపాటూ వీడియోలను ఈ యాప్ లో పొందుపరిచే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ నెల మొత్తం ఐపీఎల్ స్ట్రీమింగ్ ఉచితంగా అందించి సీజన్ ముగిసే సమయానికి అందులో చాలా వరకూ సరికొత్త కంటెంట్ తో వీక్షకుల మనసును చోరగొనాలనే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రీపెయిడ్ ప్లాన్ ధరల వివరాలపై కసరత్తు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. దీనిని జియో సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఈ తరహాలో ఉండవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా డైలీ, గోల్డ్, ప్లాటినం అనే పేర్లతో మూడు రకాలా ప్లాన్లు ఉన్నట్లు తెలుస్తుంది. అవేంటో వాటి వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం.
డైలీ ప్లాన్..
ఈ ప్లాన్ ధర రూ. 2 మాత్రమే. అంటే జియో సబ్ స్క్రైబర్స్ దీనిని కొనుగోలు చేసి రోజంతా జియో యాప్ లోని అన్ని రకాలా వీడియోలు, పాటలు, సినిమాలు, వెబ్ సిరీస్లు, స్పోర్ట్స్ అన్నీ చూడవచ్చు. మామూలుగా ఈ డైలీ ప్లాన్ ధర రూ. 29 గా నిర్ణయించారు. కానీ ప్రస్తుతం ఆఫర్లో భాగంగా ఇంత తక్కువ ధరకు అందిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే వినియోగదారునికి దీంతో మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఒక్కరు దీనిని కొనుగోలు చేస్తే ఇద్దరు వ్యక్తులు వేరు వేరు డివైజెస్ లో కనెక్ట్ చేసి చూసుకోవచ్చు. అంటే వన్ సబ్ స్క్రిప్షన్ టూ డివైజ్ అనమాట. ఈ ఆఫర్ అమల్లోకి వస్తే వీకెండ్ సేల్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నెలంతా కాకపోయినా శని, ఆది వారాంతాల్లో తక్కువ డబ్బులు వెచ్చించి అందులోని తనకు ఇష్టమైన కంటెంట్ ను చూసేందుకు వీక్షకుడు ఇష్టపడతాడు.
గోల్డ్ స్టాండర్డ్ ప్లాన్..
ఈ ప్లాన్ పైన చెప్పిన విధంగా ఒక్క రోజు సబ్ స్క్రిప్షన్ ఉండదు. మినిమం మూడు నెలలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా దీని ధర రూ. 299 గా నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం ఆఫర్లో భాగంగా రూ.99 కే అందిచనుంది. ఇందులో కూడా రెండు డివైజ్ లను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి లాంగ్ ప్యాక్ తీసుకున్నప్పుడు వినియోగదారునికి బయట దొరికే స్ట్రీమింగ్ వేదికలపై దొరికే అన్నింటినీ ఒకే చోట చేర్చి.. ఇందులో అందుబాటులో ఉంచితే జియో కు వినోదరంగంలో కూడా తిరుగు ఉండదు అని చెప్పాలి.
ప్లాటినం ప్రీమియం ప్లాన్..
ఈ ప్లాన్ ను సబ్ స్క్రైబ్ చేసుకుంటే ఏడాది పాటూ జియో సినిమా లో స్ట్రీమింగ్ అయ్యే అన్ని కార్యక్రమాలను వీక్షించవచ్చు. ఇందులో ఉండే కంటెంట్ ను పై రెండు ప్లాన్లల్లో ఇద్దరు మాత్రమే లాగిన్ అయితే ఇందులో నలుగురు నాలుగు వేరు వేరు డివైజుల్లో లాగిన్ అయి అందులో ఎవరికి నచ్చిన కంటెంట్ వారు చూడవచ్చు. దీని ధరను రూ. 1199 అని చెప్పి డిస్కౌంట్ పోగా రూ. 599 చెల్లిస్తే సరిపోతుంది అని చెబుతున్నారు. ఇందులో వినియోగదారునికి నచ్చే అంశం ఒకటి ఉంది. లైవ్ లో జరిగే కార్యక్రమాలకు మినహా మిగిలిన రికార్డెడ్ ప్రోగ్రాంలకి మధ్య మధ్యల ప్రకటనలు ఉండకుండా చూసే వెసులు బాటును కల్పిస్తున్నారు.
ఇప్పటి వరకూ మనం తెలుసుకున్నది బాగానే ఉంది. అయితే ఇందులో ఏఏ కంటెంట్ ఉంటుంది. ప్రస్తుతం ప్రదాన స్రవంతి ఓటీటీ వేదికలపై లభ్యమయ్యే అన్ని వీడియోలు, సినిమాలు, వెబ్ సిరీస్లు ఇందులో అందుబాటులో ఉంటాయా లేక కేవలం జియో వాళ్లు అందించిన వాటినే చూడాలా అనే విషయం తెలియాల్సి ఉంది. అంతేకాకుండా వీటిని ఎవరైనా సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చా లేక కేవలం జియో వినియోగదారులు మాత్రమే అర్హులా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పైన తెలిపిన ధరలు ఎంతకాలం ఉంటాయి, ఎవరెవరికి అందుబాటులో ఉంటాయి. ఒక వేళ జియో కస్టమర్ కాకపోతే అతనికి సబ్ స్క్రిప్షన్ ధర ఎంత ఉంటుంది. ఇలాంటి కీలకమైన అంశాలపై ఉన్న సందేహాలను అంబానీ నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.
T.V.SRIKAR