Bank update : మే నెల వస్తుంది.. ICICI – IDFC కస్టమర్లు జాగ్రతా.. ఛార్జీల మోత మోగబోతుంది

మే నెల చాలా మందికి ఈ నెల సాధార నెలలాగానే ఉంటుంది. అదే బిజినెస్, ఆర్థిక సంస్థలకు మాత్ర ఈ నెల ఆర్థిక నెల అని చెప్పవచ్చు. మే నెల ప్రారంభం కానుంది. ఈ నెలలో దేశ వ్యాప్తంగా ఆర్థిక సంస్థలకు సంబంధించిన కొత్త కొత్త రూల్ అమలులోకి వస్తాయి. లేదంటే ఉన్న రూల్స్ రద్దు చేయ్యడం.. రూల్స్ ను సవరణ చేయ్యడం ఇలా చాలానే రూల్స్ వస్తుంటాయి. ఇక సామాన్యులు.. కస్టమర్లకు తగ్గితే పండగే.. పెంచితే వారి జేబులకు చిల్లు పడినట్లే.. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే.. ప్రైవేటు బ్యాంకులు సర్వీసు ఛార్జీల మోత మోగిస్తుంటాయి. ఇక ప్రైవేటు రంగ బ్యాంకుల్లో టాప్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు.. తాజాగా తన కస్టమర్లకు షాకిచ్చేందుకు రెడీ అయ్యింది.

మే నెల చాలా మందికి ఈ నెల సాధార నెలలాగానే ఉంటుంది. అదే బిజినెస్, ఆర్థిక సంస్థలకు మాత్ర ఈ నెల ఆర్థిక నెల అని చెప్పవచ్చు. మే నెల ప్రారంభం కానుంది. ఈ నెలలో దేశ వ్యాప్తంగా ఆర్థిక సంస్థలకు సంబంధించిన కొత్త కొత్త రూల్ అమలులోకి వస్తాయి. లేదంటే ఉన్న రూల్స్ రద్దు చేయ్యడం.. రూల్స్ ను సవరణ చేయ్యడం ఇలా చాలానే రూల్స్ వస్తుంటాయి. ఇక సామాన్యులు.. కస్టమర్లకు తగ్గితే పండగే.. పెంచితే వారి జేబులకు చిల్లు పడినట్లే.. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే.. ప్రైవేటు బ్యాంకులు సర్వీసు ఛార్జీల మోత మోగిస్తుంటాయి. ఇక ప్రైవేటు రంగ బ్యాంకుల్లో టాప్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు.. తాజాగా తన కస్టమర్లకు షాకిచ్చేందుకు రెడీ అయ్యింది.

  • ఐసీఐసీఐ బ్యాంకు సేవింగ్స్ లో సవరణలు..

ఐసీఐసీఐ బ్యాంకు.. ఇటీవలే ఈమేరకు కీలక ప్రకటన చేసింది. ఐసీఐసీఐ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఛార్జీల్ని సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఛార్జీలు పెంచే సర్వీసుల్లో ప్రధానంగా చెక్ బుక్, ఐఎంపీఎస్‌, ఈసీఎస్‌/ఎన్‌ఏసీహెచ్‌, డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ వంటివి ఉన్నాయి. పెరిగిన ఛార్జీలు.. మే 1, 2024 నుంచి అమల్లోకి రాబోతున్నట్లు బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మొత్తం 17 సేవలకు సంబంధించి ఛార్జీలు పెంచినట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. డెబిట్ కార్డ్‌ లావాదేవీల విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 99 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 200 రూపాయలు వార్షిక రుసుము ‍‌(Annual fee) చెల్లించాలి.

  • యుటిలిటీ బిల్ పేమెంట్స్.. అంటే ఏంటి..?

యుటిలిటీ బిల్స్ అంటే ఎంటి అని ఆలోచిస్తున్నారా..? అదేంటో కాదు.. మీరు ప్రతి నెలల్లో మీ ఇంట్లో కేబుల్ బిల్, కరెంట్ బిల్, వాటర్ బిల్, ఇంటర్నెట్ బిల్, గ్యాస్ బిల్, టెలిఫోన్ బిల్ ఇలా అన్ని కూడా ఈ కోవలోకే వస్తాయి. కాగా మే 1 నుంచి ఈ బిల్లులు కట్టే వారికి బిగ్ షాక్ ఇవ్వనుంది ఈ రెండు బ్యాంకులు.. అంటే మీరు గతంలో కట్టే చెల్లింపు చార్జిలకంటే.. వచ్చే నెల నుంచి ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలను ప్రైవేట్ బ్యాంకులైన యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుల కస్టమర్లకు మాత్రమే ఇది బిగ్ షాక్ అని చెప్పాలి.

  • నగదు లావాదేవీ పరిమితి..

ఫ్రేమ్, లిబర్టీ, ఫ్రెస్టీజ్, ప్రియారిటీ సేవింగ్స్ ఖాతాల్లో నెలకు రూ. 25,000 వరకు థర్ట్ పార్టీ లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి రూ. 1000కి రూ. 10 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రెమ్, లిబర్టీ ఖాతాల్లో నెలకు ఐదు లావాదేవీలు.. దాదాపు రూ. 1.5 లక్షల వరకు ఉచితంగా చేసుకోవచ్చు. ప్రెస్టీజ్ లో ఐదు లావాదేవీలు-ఎక్కువగా రూ.2 లక్షలు, ప్రియారిటీలో ఏడు లావాదేవీలు.. రూ.7 లక్షల వరకు ఎలాంటి డబ్బులు చేల్లించాల్సిన అవసరం లేదు. మరోవైపు వరసగా రెండు నెలల పాటు శాలరీ ఖాతాలో వేతనం క్రెడిట్ కాకపోతే నెలకు రూ. 100 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.

ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు..

  • డెబిట్ కార్డ్ డీ-హాట్ లిస్టింగ్ ఛార్జీలు లేవు..
  • అడ్రస్ కన్ఫర్మేషన్ ఛార్జీలు- ఛార్జీలు లేవు..
  • డెబిట్ కార్డ్ పిన్ జెనరేషన్ ఛార్జీలు- ఛార్జీలు లేవు..
  • బ్యాలెన్స్ సర్టిఫికెట్, ఇంట్రెస్ట్ సర్టిఫికెట్- ఛార్జీలు లేవు..
  • అకౌంట్ క్లోజర్ ఛార్జీలు – సున్నా అంటే ఎలాంటి ఛార్జీలు లేవు..
  • బ్రాంచీల వద్ద అడ్రెస్‌ మార్పు సేవలు- ఎలాంటి ఛార్జీలు లేవు..
  • లియన్ మార్కింగ్ అండ్ అన్ మార్కింగ్ సేవింగ్స్ అకౌంట్- ఛార్జీలు లేవు..
  • రీఇష్యూ ఇంటర్నెట్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్- ఎలాంటి ఛార్జీలు లేవు..
  • రిట్రైవల్ ఆఫ్ ఓల్డ్ ట్రాన్సాక్షనల్ డాక్యుమెంట్స్/ఎంక్వైరీస్ రిలేటెడ్ టు ఓల్డ్ రికార్డ్స్ – ఎలాంటి ఛార్జీలు లేవు..
  • నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ మ్యాండేట్ వన్ టైమ్ మ్యాండేట్ ఆథరైజేషన్ సర్వీసు- ఛార్జీలు లేవు..

పెరగనున్న సర్వీసులుకు చెల్లింపు ఛార్జీలు..

  • సిగ్నేచర్ అటెస్టేషన్- అప్లికేషన్/లెటర్‌కు రూ. 100 చెల్లించాలి.
  • స్టాప్ పేమెంట్ ఛార్జీలు- నిర్దిష్ట చెక్స్‌కు అయితే రూ. 100 ఉంటుంది.
  • డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలు- సిటీల్లో రూ. 200 గా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 99 గా ఉంది.
  • డీడీ, పీఓ- క్యాన్సిలేషన్/డూప్లికేట్/రీవాలిడేషన్లకు సంబంధించిన రూ. 100 చొప్పున కట్టాలి.
  • ఈసీఎస్‌/ఎన్‌ఏసీహెచ్‌డెబిట్ రిటర్న్స్- ఆర్థిక అవసరాల కోసం ఒక్కోసారి రూ. 500 చెల్లించాలి.
  • చెక్ బుక్స్- ఏడాదికి 25 చెక్ లీవ్స్‌కు ఎలాంటి ఛార్జీల్లేవు. ఆ తర్వాత ప్రతి లీఫ్‌కు 4 రూపాయలు చెల్లించాలి.
  • ఐఎంపీఎస్‌- అవుట్ వర్డ్- రూ. 1000 వరకు ట్రాన్సాక్షన్‌కు రూ. 2.50 చెల్లించాలి. అదే రూ. 25 వేల వరకు
  • అయితే రూ. 5 చొప్పున చెల్లించాలి. గరిష్టంగా రూ. 5 లక్షల వరకు అయితే ప్రతి లావాదేవీకి రూ. 15 చెల్లించాల్సి వస్తుంది.

 

నెలలో యావరేజ్ బ్యాలెన్స్ నిబంధన..

  • సేవింగ్స్ ప్రో మ్యాక్స్.. రూ. 50,000 లకు రూ.1000 వరకు ఛార్జి
  • సేవింగ్స్ ప్రో ప్లస్, యెస్ ఎసెన్స్, యెస్ రెస్పెక్ట్.. రూ.25,000.. లకు రూ.750 ఛార్జి
  • సేవింగ్స్ ప్రో రూ. 10,000 వేలకు రూ. 750 ఛార్జి.
  • సేవింగ్స్ వాల్యూ, కిసాన్ ఎస్ ఏ.. 5000 వేలకు రూ. 500 ఛార్జి
  • మై ఫస్ట్ యెస్ రూ.2500 లకు రూ. 250 ఛార్జిలు చెల్లించాల్సి ఉంటుంది.

క్యాష్​ డిపాజిట్ ఛార్జీలు..

బ్యాంకు హాలీడే సమయంలో, బ్యాంకు పని రోజుల్లో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ.10 వేల కంటే ఎక్కువ క్యాష్​ డిపాజిట్​ చేస్తే, ప్రతి లావాదేవీపై రూ.50 రుసుము విధిస్తారు. అయితే ఈ ఛార్జీలు సీనియర్​ సిటిజన్లకు, బేసిక్ సేవింగ్స్​ అకౌంట్స్, జన్ ధన్ అకౌంట్లకు వర్తించవు. అలాగే దివ్యాంగులు, దృష్టి లోపం ఉన్నవారు, స్టూడెంట్​ అకౌంట్లకు కూడా ఈ ఛార్జీలు వర్తించవు.

డెబిట్ కార్డు ఛార్జీలు..

  • ఎలిమెంట్ రూ.299
  • ఎంగేజ్ రూ.399
  • ఎక్స్ ప్లోర్ రూ.599
  • రూపే రూ. 149

IDFC తొలి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్ ఏంటో తెలుసా..?

IDFC ఫస్ట్ బ్యాంక్, క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు సంబంధించి కొత్త రూల్‌ తీసుకొచ్చింది.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఇక్కడ యుటిలిటీ బిల్స్ రూ. 20 వేలు దాటినప్పుడు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసే పక్షంలో ఒక శాతం సర్‌ఛార్జీ అదనంగా 18 శాతం జీఎస్టీ పడుతుంది. అందుకే క్రెడిట్ కార్డులు వాడేవారు ముందుజాగ్రత్తలు తెలుసుకోవాలి.. ఏ ట్రాన్సాక్షన్లపై, ఏ పేమెంట్లపై ఎలాంటి ఛార్జీలు పడుతున్నాయో తెలుసుకోవాలి. లేదంటే మీ జేబుకు చిల్లు పడి డబ్బులు మొత్తం మన చేతులారా మనమే ఇస్తునట్లు లేక్క.. ఇలా జరిగితే మనం పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంది.

బ్యాంక్‌ సెలవులు…

బ్యాంక్ ఉద్యోగులకు మే నెలలో ఫుల్ ఖుషి అనే చెప్పాలి. మే నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. ఈ 12 రోజుల్లో.. రెండు.. నాలుగు శనివారాలు, 4 ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

SSM