GAS RATE: స్వల్పంగా తగ్గిన గ్యాస్ ధర..

గ్యాస్‌ బండ.. గుదిబండగా మారిన వేళ.. చమురు సంస్థలు గుడ్‌న్యూస్‌ చెప్పాయి. 2024ఆర్థిక సంవత్సరం మొదటిరోజే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తూ ప్రకటన చేశాయి.

  • Written By:
  • Publish Date - April 1, 2023 / 08:00 PM IST

ప్రతీ నెల ఒకటో తేదీన పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ, ఏటీఎఫ్, కిరోసిన్ ధరలను సమీక్షించి.. అవసరమైతే మార్పులు చేస్తాయ్. ఇప్పుడు అదే జరిగింది. కాకపోతే ఇంట్లో వాడే గ్యాస్ కాదు.. కమర్షియల్ గ్యాస్‌ ధరలు తగ్గాయ్. విపరీతంగా పెరిగిన ధరలను సవరించిన చమురు సంస్థలు.. వాణిజ్య సిలిండర్ల ధరలలో తగ్గింపు చేశాయ్. 19కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 92రూపాయలు తగ్గించింది. తగ్గిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయ్. ఐతే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

వాణిజ్య అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ల ధరలలో తగ్గింపు జరగడం కాస్త ఉపశమనం ఇస్తున్నా, గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలలో తగ్గింపు లేకపోవడం సామాన్య, మధ్యతరగతి జనాలను నిరాశకు గురి చేసింది.