GOLD PRICE: రోజు రోజుకీ బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ఇజ్రాయెల్ – హమాస్ వార్ ఎఫెక్ట్‌తో గోల్డ్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మెరుపులు ఇలాగే కొనసాగితే ఈ 2024లో బంగారం రూ.70 వేల మార్కును దాటుతుందా..? ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారు..? ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 63 వేల రూపాయలకు పైగా పలుకుతోంది. గోల్డ్ రేట్స్ ప్రతి యేటా ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో 70 వేల రూపాయలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
T CONGRESS: ఎప్పుడంటే.. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారంటే..
ఇండియాతో పాటు చైనాలో బంగారానికి డిమాండ్ బాగా ఉంటోంది. ఇవి రెండూ అత్యధిక జనాభా కలిగిన దేశాలు కావడంతో కొనుగోళ్ళు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గోల్డ్ బార్స్, కాయిన్స్ కొంటోంది. దీని వల్ల కూడా రేట్లు పెరుగుతున్నట్టు చెబుతున్నారు. భారత్‌లో నగలు కొనేవారి సంఖ్య పెరుగుతుండగా.. చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నప్పటికీ అక్కడా గోల్డ్‌కి డిమాండ్ తగ్గడం లేదు. అమెరికా ఫెడ్ రేట్లు తగ్గిస్తుండటం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో రూపాయి బలహీనం అవుతోంది. అందుకే బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. 2024లో 10 గ్రాముల బంగారం 70 వేలు దాటుతుందని ఆలిండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చెబుతోంది. రేట్లు పెరిగితే మాత్రం ఆ ఎఫెక్ట్ కొంతవరకూ తమ బిజినెస్ పై చూపించే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతర్జాతీయంగా ఉద్రికత్తలు తలెత్తడం, ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యం పరిస్థితులు, అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ తగ్గడం లాంటి కారణాలతో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడిని బంగారంపై పెడుతున్నారు. ప్రస్తుతం డాలర్‌పై రూపాయి మారకం విలువ 83 రూపాయల దగ్గర కొనసాగుతోంది.
2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో ఫారెన్ ఇన్వెస్టర్స్.. మన దేశీయ మార్కెట్లలో స్టాక్స్‌లో పెట్టుబడులు తగ్గించే ఛాన్సుంది. వాళ్ళు ఆ ఇన్వెస్ట్ మెంట్‌ను బంగారంపైకి మళ్ళిస్తే.. రేట్లు పెరుగుతాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ధరలు పెరిగితే బంగారం అమ్మకాలపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అయితే ద్రవ్యోల్భణం ప్రభావం కొనసాగుతున్నందున బంగారం మీద పెట్టుబడి పెట్టడం బెటర్ అని చాలామంది భావిస్తున్నారు. సో.. రాబోయే రోజుల్లో గోల్డ్ 10 గ్రాములు 70 వేల మార్క్ దాటే అవకాశం ఉన్నందున ఏమైనా అవసరాలు ఉంటే ఇప్పుడే కొనడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.