GOLD PRICES: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇజ్రాయెల్ వార్ ఎఫెక్టేనా..?

గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయ్. కొద్దిరోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతుండటంతో.. గోల్డ్ లవర్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇంకా తగ్గాలని ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. ఐతే బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయ్.

  • Written By:
  • Publish Date - October 9, 2023 / 08:12 PM IST

GOLD PRICES: బంగారం.. ఎప్పుడూ బంగారమే. తగ్గినప్పుడే దాన్ని కొనాలి. ఎప్పుడు ధరలు పెరుగుతాయో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. కొద్దిరోజులుగా పసిడి ధరలు తగ్గుతుండటంతో మరింత దిగి వస్తుందని భావించి కొనుగోలుకు వెయిట్ చేసేవారు ఇప్పుడు బ్యాడ్‌న్యూస్ వినాల్సి వచ్చింది. గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయ్. కొద్దిరోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతుండటంతో.. గోల్డ్ లవర్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇంకా తగ్గాలని ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు.

ఐతే బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయ్. పది గ్రాముల బంగారం ధరలపై నాలుగు వందల రూపాయల వరకూ పెరిగింది. బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి.. 53,150 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగి ప్రస్తుతం రూ.57,540 దగ్గరకు చేరింది. బంగారం ధరతో పోలిస్తే.. వెండి రేటులో పెద్దగా ఎలాంటి మార్పు కనిపించలేదు. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.75 వేలకు చేరుకోగా.. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర 72వేల వంద రూపాయలుగా ఉంది. ఇజ్రాయెల్‌పై పాలస్తీనా హమాస్ దాడులతో.. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలతో బంగారం, ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి.

ఇన్వెస్టర్లకు సేఫ్టీ ఇన్వెస్ట్‌మెంట్ మార్గంగా బంగారం నిలిచింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతాయని.. దీంతో బంగారం, వెండి ధరలు పైపైకి దూసుకెళ్తాయని వ్యాపార నిపుణులు అంటున్నారు. దీంతో భవిష్యత్‌లో తులం బంగారం రూ.58 వేల మార్క్‌ను దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.