Rameshbhai Rupareliya: నెయ్యితో కోట్లు సంపాదిస్తున్నాడు.. ఇంతకీ ఈ నెయ్యి స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

గుజరాత్‌లోని గోంఢాల్‌లో పశుశాల నడుపుతున్నాడు. తన దగ్గరున్న ఆవు పాల నుంచి నెయ్యిని చేసి.. దాన్నించి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాడు. ఈ నెయ్యిలో కుంకుమ పువ్వు, పసుపు, పిప్పళ్లు, గులాబీ రేకులు, అవసరాన్ని బట్టి కొన్ని రకాల మూలికలు కలుపుతుంటాడు.

  • Written By:
  • Publish Date - October 22, 2023 / 05:25 PM IST

Rameshbhai Rupareliya: నార్మల్‌గా నెయ్యి వ్యాపారం చేసుకునేవాళ్ల జీవితాలు, ఆదాయాలు ఎలా ఉంటాయి. బాగా డిమాండ్‌ ఉండి, అమ్మకాలు బాగా జరిగితే సంవత్సరానికి లక్షలు సంపాదిస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం నెయ్యి వ్యాపరంలో కళ్లు చెదిరే లాభాలు పొందుతున్నాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా సంవత్సరానికి రూ.10 కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రమేష్‌ భాయ్. గుజరాత్‌లోని గోంఢాల్‌లో పశుశాల నడుపుతున్నాడు. తన దగ్గరున్న ఆవు పాల నుంచి నెయ్యిని చేసి.. దాన్నించి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాడు.

ఈ నెయ్యిలో కుంకుమ పువ్వు, పసుపు, పిప్పళ్లు, గులాబీ రేకులు, అవసరాన్ని బట్టి కొన్ని రకాల మూలికలు కలుపుతుంటాడు. అంతేకాదు, దాదాపు 31 లీటర్ల పాలకు వచ్చిన వెన్నను కాచి అందులో ఈ మూలికల్ని వేసి కేజీ నెయ్యి అయ్యే వరకూ బాగా మరిగిస్తాడు. చిక్కగా అయిన ఈ నెయ్యిని తినడానికి మాత్రం వాడరు. కేవలం చర్మానికే రాస్తారు. కాస్త రాసుకుంటే తలనొప్పీ, చర్మవ్యాధులూ తగ్గుతాయట. వాసన చూడ్డం వల్ల దగ్గు అదుపులో ఉంటుందట. చర్మంపైన మొటిమల్నీ, నల్లమచ్చల్నీ అదుపుచేస్తుందట ఈ వనమూలికల నెయ్యి. ఇలా ఔషదాలు తయారు చేసేందుకు ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని అనుమతులను కూడా రమేష్‌ తీసుకున్నాడు. చాలా కాలం నుంచి ఇదే బిజినెస్‌లో ఉన్నాడు. రమేష్‌ దగ్గరి నెయ్యి బాగా పనిచేస్తుండటంతో ఫుల్‌ గిరాకీ అవుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లే కాదు.. విదేశాల్లో కూడా రమేష్‌ తయారు చేసే నెయ్యికి ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ప్రతీ ఏటా తన ఉప్పత్తులను వివిధ దేశాలు పంపుతున్నాడు రమేష్‌.

ఈ వ్యాపారం ద్వారా సంవత్సరానికి దాదాపు రూ.10 కోట్లు సంపాదిస్తున్నాడు. కెనడా, అమెరికా, సౌదీ అరేబియాతో పాటు దాదాపు 100 దేశాలకు రమేష్‌ నెయ్యి ఎక్స్‌పోర్ట్‌ అవుంతోంది. ఈ న్యూస్‌ ఇప్పుడు గుజరాత్‌లో హాట్‌ టాపిక్గా మారింది. కష్టపడి ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదించేబదులు.. ఇలా నెయ్యి కాయడం నేర్చుకుని కోట్లు సంపాదించుకోవడం బెటర్‌ అంటూ ఫన్నీ పోస్ట్‌లు పెడుతున్నారు నెటిజన్లు.