యూజర్ల ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా సరికొత్త ఫీచర్స్‌తో పాటు డేటాను సెక్యూర్‌గా ఉంచుంతోంది వాట్సాప్. మనదేశంలో 50కోట్ల మందికి పైగా వాట్సాప్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. అలాంటి యాప్.. ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారులకు చిన్న వీడియో మెసేజ్‌లు పంపేలా.. కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. అంటే టెక్ట్స్ మెసేజ్ బదులు.. వాట్సాప్‌లో వీడియో మెసేజ్‌లతో రిప్లయ్ ఇవ్వొచ్చు అన్నమాట. ఈ వీడియో మెసేజ్‌లు 60సెకన్ల వరకు ఉండవచ్చు.
ఈ మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అని కంపెనీ తెలిపింది. ఫీచర్ యొక్క రోల్ అవుట్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ త్వరలో ఇది అందుబాటులో ఉంటుంది. కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందో చిన్న వీడియో సహాయంతో మెటా అధినేత మార్క్.. ఫేస్‌బుక్ వేదికగా వివరించాడు. ఈ ఫీచర్‌ని ఉపయోగించడం… ప్రస్తుతం రియల్ టైమ్ వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేయడం లాంటిది. టెక్స్ట్ బాక్స్ పక్కన ఉన్న ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఫీచర్‌ను యాక్సెస్ చేయొచ్చు. డిఫాల్ట్‌గా, ఎవరైనా సందేశాన్ని తెరిచినప్పుడు వీడియోలు ధ్వని లేకుండా ప్లే అవుతాయ్. సౌండ్ ఆన్ చేయడానికి, వీడియోపై మళ్లీ ట్యాప్ చేయాలి.