Social Media: ట్విట్టర్ నాకో గుదిబండ..ఎవరైనా కొంటానంటే అమ్మేస్తా

అంతన్నాడింతన్నాడే గంగరాజు.. నట్టేట ముంచేశాడే అన్నట్టు తయారైంది అమెరికన్ బిలయనీర్ ఎలాన్ మస్క్ పరిస్థితి. వాక్ స్వాతంత్ర్యానికి పెద్ద పీట వేస్తానంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్‌కు మొత్తానికి తత్వం బోధ పడింది. కార్ల నుంచి స్పేస్ వరకు ఎన్నో వ్యాపారాలు చేస్తున్న మస్క్‌కు ట్విట్టర్‌ను దారిలో పెట్టడం మాత్రం తలకు మించిన భారంగా మారింది. అందుకే దాన్ని ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నాడు. ట్విట్టర్‌ను నడపడం చాలా పయిన్‌ఫుల్‌గా మారిందని.. ఎవరైనా రైట్ పర్సన్ దొరికితే ట్వట్టర్‌ను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - April 12, 2023 / 04:11 PM IST

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యులో మస్ట్ చాలా విషయాలు ప్రస్తావించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలన్న తన నిర్ణయాన్ని సమర్ధించుకున్న మస్క్ దాన్ని గాడిలో పెట్టలేక కొన్ని నెలలుగా తీవ్ర వేదన అనుభవిస్తున్నట్టు చెప్పారు. ట్విట్టర్‌ను ఆయన రోలర్‌కోస్టర్‌తో పోల్చారు.

ట్విట్టర్‌లో మార్పులు చేర్పులు చేసి దాన్ని సమూలంగా మార్చడానికి ఒక్కోసారి తాను ఆఫీసులోనే నిద్రపోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు మస్క్. గతేడాది అక్టోబర్‌లో ట్వి్ట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించి సోషల్ మీడియాను షేక్ చేసిన మస్క్.. ఆ తర్వాత అనేక పరిణామాల తర్వాత మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ బాస్‌గా మారకముందే ఉద్యోగాల్లో కోత విధించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ట్వట్టర్‌ను అనేక మార్పులకు వేదికగా మార్చిన మస్క్ చివరకు మళ్లీ అమ్మకానికి పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.