Apple iPhones: రెండు రోజుల్లో నాలుగు లక్షల ఐఫోన్లు సేల్.. ఆఫర్లతో ఎగబడ్డ ఫ్యాన్స్..!

ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రస్తుతం స్పెషల్ సేల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులతోపాటు ఐఫోన్స్ కూడా భారీ డిస్కౌంట్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. దీంతో యాపిల్ ఫ్యాన్స్ ఈ ఫోన్ల కోసం ఎగబడ్డారు.

  • Written By:
  • Publish Date - October 13, 2023 / 05:00 PM IST

Apple iPhones: యాపిల్ ఫోన్లకు వినియోగదారులు కాదు.. ఫ్యాన్స్ ఉంటారంటారు. అంత డిమాండ్, క్రేజ్ ఉంటుంది యాపిల్ ఫోన్లకు. అందుకే అందరి దృష్టీ యాపిల్ రూపొందించే ఐఫోన్లపైనే. అయితే, వీటి ఖరీదు ఎక్కువ ఉండటం వల్ల చాలా మంది కొనుక్కోలేరు. ఇలాంటివాళ్లకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్ వరంగా మారాయి. ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రస్తుతం స్పెషల్ సేల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులతోపాటు ఐఫోన్స్ కూడా భారీ డిస్కౌంట్స్‌తో అందుబాటులోకి వచ్చాయి.

దీంతో యాపిల్ ఫ్యాన్స్ ఈ ఫోన్ల కోసం ఎగబడ్డారు. దేశవ్యాప్తంగా రెండు రోజుల్లోనే నాలుగు లక్షలకుపైగా ఐఫోన్లు కొన్నారట. అంటే.. ఏ స్థాయిలో ఐ ఫోన్లు అమ్ముడయ్యాయో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో ఐఫోన్లపై కనీసం రూ.10 వేలకుపైగా డిస్కౌంట్ లభించింది. మోడల్‌ను బట్టి, కార్డ్ ఆఫర్‌ను బట్టి, అంతకంటే ఎక్కువ డిస్కౌంట్‌తో, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ఐఫోన్లను సేల్‌కు తెచ్చింది ఫ్లిప్‌కార్ట్. దీంతో యాపిల్ ఫ్యాన్స్ పోటీపడి మరీ ఐఫోన్లు కొన్నారు. ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14 మోడళ్లపై భారీ డిస్కౌంట్లు లభించాయి. అలా ఫ్యాన్స్ నాలుగు లక్షలకు పైగా ఐఫోన్లను కొనుగోలు చేశారు. అది కూడా రెండు రోజుల్లోనే కొనుగోలు చేయడం విశేషం.

ఈ అమ్మకాల ద్వారా 2.4 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరిందట. అయితే, ఎక్కువ మంది ఈఎంఐల ద్వారానే ఐఫోన్లు కొనుగోలు చేయడం విశేషం. ఆఫ్‌లైన్ సేల్స్ కన్నా.. ఆన్‌లైన్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగానే ఐఫోన్ కొత్త మోడల్ విడుదలవ్వగానే.. పాత వాటి ధరల్ని యాపిల్ తగ్గిస్తుంది. ఈసారి యాపిల్ సంస్థ తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల ద్వారా తక్కువ ధరలోనే ఐఫోన్స్ అందుబాటులోకి రావడంతో సేల్స్ భారీగా పెరిగాయి.