అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం నార్కేడ్‌మిల్లి గ్రామం ఇది. ఇక్కడ పచ్చడి చాలా ఫేమస్. ఏపీ, తెలంగాణకే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా వీళ్లు పచ్చళ్లు ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు. విదేశాల నుంచి కూడా వీళ్లకు పచ్చడి ఆర్డర్స్ వస్తుంటాయి. అందుకే భారీ మొత్తంలో పచ్చళ్లు తయారు చేస్తుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ గ్రామం ఓ పచ్చడి ఫ్యాక్టరీ.
కేవలం మామిడికాయ పచ్చడి మాత్రమే కాదు. సీజన్‌ను బట్టి అన్ని రకాల పచ్చళ్లు తయారు చేస్తుంటారు. వెజ్‌తో పాటు నాన్ వెజ్ పచ్చళ్లను కూడా తయారు చస్తున్నారు. ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకునేవాళ్లు చాలా తక్కువ. చాలా మంది పచ్చడి తయారీనే బిజినెస్‌గా పెట్టుకున్నారు. ఇంత మంది పచ్చడి తయారీలో ఉన్నా.. వాళ్లందిరికీ చేతినిండా పని దొరుకుతోంది.
వ్యాపారం బాగానే ఉన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదని పచ్చడి వ్యాపారులు చెప్తున్నారు. విదేశాలకు ఎగుమతులు చేస్తున్నా కూడా తమ వ్యాపారం అన్‌ఆర్గనైజ్డ్ సెక్టార్ జాబితాలోనే ఉందంటున్నారు. ప్రభుత్వం నుంచి సహాకారం లభించి లోన్లు ఇప్పిస్తే.. అంతా కలిసి చిన్న సైజ్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటామంటున్నారు. తమ వ్యాపారం పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుందని వాళ్లు చెప్తున్నారు.