రిజర్వ్ బ్యాంక్ ఇండియా (Reserve Bank of India) కండీషన్లతో పుట్టెడు కష్టాల్లో ఉన్న పేటీఎం ఇప్పుడు తన వాలెట్ బిజినెస్ (Wallet Business) ను అమ్ముకోవాలని నిర్ణయించింది. పేటీఎం మాతృసంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (Communications Limited) తన వాలెట్ బిజినెస్ ను రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి లేదంటే HDFC బ్యాంక్ కు అమ్మడానికి చర్చలు జరుపుతోంది. ఇటీవల పేటీఎంకు చెందిన వాలెట్ సేవలను నిషేధించింది. పేటీఎం యాజమాన్యం… 2023 నవంబరు నుంచే జియో ఫైనాన్షియల్‌తో చర్చలు జరుపుతోంది. ఆర్‌బీఐ నిషేధానికి కొన్ని రోజుల ముందు నుంచే HDFC తోనూ సంప్రదింపులు ప్రారంభించింది.
ముకేశ్ అంబానీకి చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ… జీయో ఫైనాన్షియల్… పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మొత్తం కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అయితే HDFC డిజిటల్ వాలెట్ పేజాప్ కు 1.4 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. పేటీఎం వాలెట్ కూడా సొంతం చేసుకుంటే… ఈ సెగ్మెంట్లో అదే పెద్ద కంపెనీ అవుతుంది. అయితే ఇప్పటిదాకా వాలెట్ సేవల్లో జియో ఫైనాన్షియల్స్ (Jio Financial) ప్రభావం పెద్దగా లేదు. ఇప్పుడు పేటీఎంతో డీల్ బాగా కలిసి వస్తుందని బిజినెస్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
ఫిబ్రవరి 29 తరువాత నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) డిపాజిట్లు స్వీకరించవద్దని RBI ఆంక్షలు పెట్టింది. కస్టమర్ల సేవింగ్, కరెంట్ అకౌంట్లతో పాటు ప్రీ-పెయిడ్ వాలెట్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు,ఫాస్టాగ్ అకౌంట్లలోకి డిపాజిట్లు లేదా టాప్-అప్ లను స్వీకరించవద్దని ఆదేశించింది. కస్టమర్లు తమ అకౌంట్‌లో ఉన్న క్యాష్ ను ఉన్నంత వరకూ వాడుకోవచ్చు. లేదంటే విత్ డ్రా చేసుకోడానికి అనుమతి ఇచ్చింది RBI. ఈ నెలాఖరు నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలు దాదాపుగా నిలిచిపోతున్నాయి. 2022 మార్చి నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది.
PPBL లైసెన్సును కూడా వచ్చే నెలలో RBI రద్దు చేస్తుందని అంటున్నారు. డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించాక బ్యాంక్‌ను రద్దు చేసే అవకాశముంది. పేటీఎం వాలెట్ లో మనీలాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ అలాంటి జరిగినట్టు RBI చెబితే ED అధికారులు దర్యాప్తు చేస్తారని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మరోవైపు పేటీఎం షేర్లు దారుణంగా పడిపోతున్నాయి. ఇప్పటికే ఇన్వెస్టర్లు 20 వేల కోట్ల రూపాయల దాకా నష్టపోయారు.