Dialogue T-shirt : తెలంగాణ యాస లో డైలాగ్ టి-షర్ట్ ట్రెండ్..

మన తెలంగాణ యాస ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. సినిమాల్లో బాగా పేలిన డైలాగులను నిజ జీవితంలో ఎప్పుడో.. ఏదో ఒక సందర్భంలో సీరియస్ గా నో.. సరదాగా నో వాడు ఉంటాం. ఇప్పుడు డైలాగులు నోటి నుంచి దొర్లి.. కుర్రకారు టీ షర్టుల మీదకి ఎక్కుతున్నాయి.

ఇప్పుడు మనం ఉన్నది ఆధునిక ప్రపంచంలో ఉన్నాం.. కన్నా ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాం అంటే అందులో  అతిశయోక్తి లేదు..

కాలం మారుతున్న కొద్ది యువత తమ నిత్య జీవన విధానంలో కాలని తగట్లు మార్పు చేందుతున్నారు. అది ఎందులో అంటే చదువులో అనుకునేరు.. ఫ్యాషన్ లో అవును ఫ్యాషన్ లోనే.. రోజులు గడుతున్నకొద్ది కొత్త కొత్త ట్రెండులు పుట్టుకొస్తున్నాయి. పాతగయినా కొద్ది.. దాన్ని తన్నే కొత్తవి వస్తున్నాయి. ఇప్పటికే రకరకాల ఫ్యాషన్‌లు చూశాం. ఫాలో అయ్యాం. ఫాలో అవుతున్నాం కూడా.. మారీ ఇంతా ఎప్పుడు ఫాలో అవ్వలేదు మన తెలుగు రాష్ట్రాల్లో.. అది ఎంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే మరీ..

ఇది వరకు మనం షాపింగ్ మాల్స్ కి వెళ్లినప్పుడు అక్కడ ఒక టీషర్ట్ కొంటే దాని మీద ఏదో ఆగ్ల భాషలో, రాసి ఉన్నటు వంటి డైలాగ్స్‌తో టి షర్ట్ ను కొని దరించాం.. దరిస్తున్నాం..
కాని ఎప్పుడు కూడా మన భాషలో, మన యాసలో రాసి ఉన్నటువంటి రాతల టి -షర్ట్ లు దరించామా..? కనీసం చూసామా.. ? ఇటువంటి ఫ్యాషన్ ఎప్పుడైనా కనబడిందా? లేదు.

ఇప్పుడు చూడబోతున్నాం.. దరించాబోతున్నాం..

అది కూడా మీకు నచ్చిన హీరో సినిమానో.. మీకు నచ్చిన హీరో డైలాగ్స్ తోనే మీ వంటి పై టీషర్టు వేసుకోవచ్చు. అది ఎక్కడో కాదు మన తెలంగాణలోనే, మన హైదరాబాద్ లోనే.. పక్కా లోకల్ డైలాగ్స్‌తో ఓ ఫ్యాషన్ బ్రాండ్ పుట్టుకొచ్చింది. మన కుర్రాళ్లుకు నచ్చేలా ఇద్దరు కుర్రాళ్లు చేసిన వినూత్న ప్రయాత్నలో మన యాసే ఫ్యాషన్ అయితే.. ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

డైలాగ్ టీ షర్ట్..

మన తెలంగాణ యాస ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. సినిమాల్లో బాగా పేలిన డైలాగులను నిజ జీవితంలో ఎప్పుడో.. ఏదో ఒక సందర్భంలో సీరియస్ గా నో.. సరదాగా నో వాడు ఉంటాం. ఇప్పుడు డైలాగులు నోటి నుంచి దొర్లి.. కుర్రకారు టీ షర్టుల మీదకి ఎక్కుతున్నాయి.

నా సావు నేను సస్తా నీకెందుకు..
అసలే డెలికేట్ మైండ్ నాది..
పోలా అదిరి పోలా..
మనల్ని ఎవడ్రా ఆపేది ..
మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీలో..
రేయ్ ఎవర్రా మీరంతా..?
తెలీదు గుర్తులేదు. మర్చిపోయా..
దేశ భాషలందు తెలుగు లెస్స..
జై బాలయ్య..
మామా ఎక్ పెగ్ లా..

ఇలా మన హీరోలు చెప్పే పాపులర్ డైలాగులన్నీ రంగు రంగుల టీషర్టుల మీద కనిపిస్తున్నాయి.
సనిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన డైలాగ్స్ సైతం.

ఇచ్చి పడేస్తా..
జంబలకడి జారు మిఠాయా..
డబ్బులు ఎవరికి ఊరికే రావు..
రైతు బిడ్డ..
చాలా కోపం..
కోకాకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ అంటూ నినాదాలు
సర్కారు వారి పాట..

వంటి డైలాగ్స్ కూడా కొత్త ట్రెండ్ గా మారాయి.

ఈ ట్రెండ్ రావడానికి కారణం ఏంటి..? ఎవరి.. ఆలోచన ఇది.. ?

తెలుగులో ఫేమస్ డైలాగుల, పదాలతో టీషర్ట్‌లను తయారు చేసి కొత్త బ్రాండ్‌ను యువతకు పరిచయం చేశారు హరీశ్, మహి అనే ఇద్దరు యువకులు. హరీష్, మహి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు. మొదటి నుంచి ఫ్యాషన్  ఆర్ట్స్ మీద అభిరుచి ఉన్న యువకులు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరినా వాళ్లకు ఇంజినీరింగ్ అంతం సంతృప్తిని ఇవ్వలేదు. వీరిద్దరూ కూడా తమ ఇంజినీరింగ్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. హరీశ్ కు రచనలు అంటే ఆసక్తి ఎక్కువ ఇష్టం కూడా.. ఇదివరకు హరీశ్ సీరియల్స్ కి స్క్రిప్ట్ అందిచిన అనుభవం కూడా ఉంది. ఈ తను రచనలు రాయకుండా ఉన్నటువంటి రజనలు గానీ, డైలాగ్స్ గానీ, నినాదాలు గానీ నిత్య దరించే టీ షర్టు పై వేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. ఆలోచనలో భాగంగా సృజనాత్మకత జోడించి ఏదో ఒకటి చేయాలని తపన పెరిగింది. ప్రాంతీయ భాష, యాసలను ఎంచుకున్నాడు. ఈ విషయం మీద యూత్‌లో క్రేజ్ పెంచేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. మిత్రుడు మహిళతో కలిసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో తెలుగుకు చోటు లేదు, తెలుగు కొటేషన్లకు గుర్తింపు లేదు. ఈ విషయాన్ని గుర్తించి దాన్నే బ్రాండ్‌గా చేయాలని ఇద్దరూ ఫిక్స్ అయ్యి అడుగు ముందుకేశారు. ఆ పట్టుదలోనే టీషర్ట్ షాప్ ని నెలకొల్పారు. మొదట్లో రోజుకూ ఐదు నుంచి పది టీషర్ట్‌లే అమ్ముడుపోయాయి. ఇప్పుడు రోజుకూ 200 నుంచి 250 టీషర్ట్‌ల ఆర్డర్లు వస్తున్నాయి.

డైలాగ్ టీ షర్ట్.. ఎలా కొనుగోలు చేయాలి.. ? ధర ఎంత.. ?

ఈ ఫ్యాషన్ బ్రాండ్ డైలాగ్ టీషర్ట్ కొనాలనుకుంటే మీరు హైదరాబాద్ రావాల్సిన పని లేదు. కేవలం ఇంటర్నెట్ చేతిలో ఉంటే చాలు 3 రోజుల్లో మీకు నచ్చిన టీషర్ట్ మీకు నచ్చిన డైలాగ్ తో సహా మీ చేతిలో ఉంటుంది. ఆన్‌ లైన్‌లో ఆర్డర్ తీసుకుని మూడు నుంచి నాలుగు రోజుల్లో దీన్ని డెలివరీ చేస్తున్నారు. సుమారు రూ. 250 నుంచి రూ. 500 లోపు ఈ టిషర్ట్ ధరలున్నాయి. మీ చేతికి అందిన టీషర్ట్ నచ్చకపోతే రిటర్న్ తీసుకుని డబ్బులు వెనక్కి ఇచ్చే సదుపాయాన్ని కూడా కల్పించారు. కానీ ఇప్పటి వరకు డెలివరీ అయిన టీ షర్టులు ఒక్కటి కూడా రిటర్న్ రాలేదని వారు గంటా బదంగా చేబుతున్నారు.

ఇతర రాష్ట్రాలకు బిజినెస్.. ?

తెలుగు రాష్ట్రాల యూత్‌తో పాటు తమిళ్, కన్నడ నుంచి కూడా ఇలాంటి టీషర్ట్ తమ లోకల్ లాంగ్వేజీలో తయారు చేయాలని విజ్ఞప్తితో.. వీరి ప్రయాణం హైదరాబాద్ తో ముగిసిపోకుండా.. ఇతర రాష్ట్రాల్లో కూడా బిజినెస్ నడుపుతున్నాను. బెంగళూర్, చైన్నె నగరాల్లో క్లాత్‌ను పరిశీలించి తయారీకి అక్కడ ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. డిజైనింగ్ వర్క్ మొత్తం హరీశ్, మహి చేస్తున్నాం. ఇక్కడ డిజైన్ చేసి తయారీ కంపెనీకి ఫార్వర్డ్ చేసి టీషర్ట్‌ను నేరుగా కస్టమర్‌కు అందించేలా ఈ కామర్స్ వెబ్‌సైట్ రూపొందించాం. ఇలా ప్రారంభమైన వీరి బిజినెస్‌కు ఇప్పుడు ఊహించని రెస్పాన్స్ అందుకున్నది. త్వరలోనే బాక్సర్స్, షాట్స్, ఉమెన్ లెగ్గిన్స్, ఉమెన్ టీషర్ట్స్, కిడ్స్‌వేర్ డ్రెస్సుల్లోనూ ఈ బ్రాండ్‌ను పరిచయం చేయబోతున్నారు. కన్నడ, మళయాల ప్రాంతీయ భాషల్లోనూ టీషర్ట్‌లు తయారు చేయబోతున్న వ్యవస్థాపకులు హరీశ్, మహీ. ట్రెండ్ అంటే అదేగా మరి.

S.SURESH