Reliance Ice : మండే వేసవిలో చల్లని వ్యాపారం.. ఐస్ క్రీమ్ అమ్మేందుకు వచ్చేస్తున్న అంబానీ..

దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అంబానీ.. అదానీల పేర్లే వినిపిస్తూ ఉంటాయి. ఒకరు బొగ్గుమొదలు, వంట నూనె వరకు అన్ని రంగాల్లో తన మార్క్ వ్యాపారాన్ని పదిలం చేసుకున్నారు. మరొకరు పెట్రోల్ మొదలు కూల్ డ్రింక్ వరకూ అన్నింటా తానే అంటూ మార్కెట్ లో పోటీ గా నిలుస్తున్నారు. ఆయనే ముఖేష్ అంబానీ. ఈయన మన్నటి వరకూ కంప కోలా పేరుతో కూల్ డ్రింక్స్ అమ్మేందుకు సిద్దమయ్యారు. అందులో భాగంగా మార్కెటింగ్ కూడా చేసేశారు. అది చాలదన్నట్లు ఇప్పుడు ఐస్ క్రీం రంగంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు.

  • Written By:
  • Updated On - April 10, 2023 / 12:08 PM IST

రిలయన్స్ అనగానే మనకు గుర్తుకు వచ్చే వస్తువులు అరడజను పైగానే ఉన్నాయి. పెట్రోల్, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, టెలికాం, పవర్, కూల్ డ్రింక్స్ ఇప్పుడు ఐస్ క్రీమ్స్. అసలే వేసవి కాలం. ఎండలు మండిపోతున్నాయి. వీటిని క్యాష్ చేసుకోవాలని భావించి శీతలపానీయాలు, ఐస్ క్రీం రంగాల్లోకి దిగుతున్నట్లు కొందరు బిజినెస్ అనలిస్ట్ లు చెబుతున్నారు.

ఇక మార్కెట్ నివేదికల ప్రకారం చూస్తే త్వరలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐస్ క్రీమ్ లను తన ప్రాడెక్ట్ ల జాబితాలోకి చేర్చుకునేందుకు సిద్దమైనట్లు తెలుసుంది. ఇప్పటికే ఈ సంస్థ 20వేల కోట్ల రూపాయలతో భారీ పరిశ్రమను గుజరాత్ వేదికగా నెలకోల్పేందుకు సిద్దం అయినట్లు సమాచారం. గతంలో ప్రముఖ ఐస్ క్రీమ్ తయారు చేసే సంస్థలైన ఐసిస్ క్రీం, స్టార్మీ ఇండస్ట్రీస్, అమూల్ వంటి దిగ్గజ కంపెనీలతో కలిసి ముందుకు వెళ్లేందుకు చర్చలు జరిపింది. అలాగే ఇప్పుడు చిన్న చిన్న ఔట్ సోర్సింగ్ ఐస్ తయారీ పరిశ్రమలతో ఉత్పత్తి ప్రారంభించి పెద్దగా ఎదిగేందుకు ప్రణాళికలు రచించింది.

ఇప్పుడు రిలయన్స్ ఐస్ క్రీమ్ తయారు చేసేందుకు ముందుకు వస్తే భారత దేశంలో భారీగా పోటీ పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే కొందరు ఆఫర్ల పేరుతో తమ ఉత్పత్తుల ధరలను తక్కువగా అయినా మార్కెట్ లో విక్రయించేందుకు సాహసం చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఉత్పత్తి పెరిగితే సప్లై కూడా పెరుగుతుంది. తద్వారా కొత్తగా ప్రవేశించిన రిలయన్స్ సంస్థ మిగిలిన ఉత్పత్తి సంస్థలతో పోటీ పడాలంటే తన ప్రోడెక్ట్ రుచిని చూపించేందుకైనా తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది. లేదా వారికి పోటీగా ఆఫర్లను అయినా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది.

రిలయన్స్ ఈ ఐస్ క్రీమ్ రంగంలోకి రావాలన్న ఆలోచన ముందు నుంచే ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో డెయిరీ రంగంలో అనుభవం కోసం ఆర్ ఎస్ సోధీ అనే కంపెనిని కొనుగోలు చేసింది. తద్వారా ఐస్ క్రీమ్ కు కావల్సిన ప్రదాన ముడి పదార్థం పాలు కావడంతో ఇందులో అనుభవాన్ని సంపాధించుకోని తద్వారా ఐస్ క్రీమ్ పరిశ్రమను క్రమక్రమంగా విస్తరింపజేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇలా చేయడం వల్ల మార్కెట్ పై ఒక అవగాహన వచ్చి సరికొత్త పాల ఉత్పత్తులను తయారు చేసేందుకు దోహదపడుతుందని కొందరు భావిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఒకటి ఉంది. గతంలో టెలికాం సంస్థలోకి జియో పేరుతో ప్రవేశించినప్పుడు అంబానీ ఆఫర్ల ధాటికి తట్టుకొని నిలబడలేక పోయాయి కొన్ని టెలికాం సంస్థలు. అదే ఫార్ములాను ఇందులో ప్రవేశపెడితే వినియోగదారుడు తక్కువ ధరకే మద్దతు ఇస్తాడు కనుక ఐస్ క్రీమ్ మార్కెట్లో గట్టిపోటీ తప్పదు అని చెప్పాలి.

 

T.V.SRIKAR