Richie Rich Club: ఇండియాలో రిచ్ క్లబ్బులో ఎంత మందో తెలుసా..? ఆ క్లబ్బులో చేరేందుకు మీ దగ్గర ఎంత డబ్బుండాలంటే..

గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న కుబేరుల గురించి ఒక సర్వే చేసింది. దీని ప్రకారం ఏ దేశంలో ఎంత సంపద ఉంటే ధనవంతులుగా పరిగణించాలో లెక్కించింది. ఇండియాలో 1 శాతం మంది ధనవంతులు ఉన్నారని, వీళ్లందరినీ రిచీ రిచ్ క్లబ్బుగా పరిగణించాలని నైట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది.

  • Written By:
  • Publish Date - May 17, 2023 / 06:50 PM IST

Richie Rich Club: మన చుట్టూ ఎవరైనా మంచి ఇల్లు, కారు, కొంచెం భూమి, నగలు వంటివి ఉంటే చాలు.. మీకేంట్రా రిచ్ అనేస్తుంటారు. ఇకపై వీటిని బట్టే ఇండియాలో ఒకరు రిచ్ అని డిసైడ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఒక సంస్థ నివేదిక ప్రకారం వాళ్లు చెప్పినంత సంపద ఉంటేనే ధనవంతుల కింద లెక్క. లేకుంటే రిచ్ కాదనే అర్థం.
గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న కుబేరుల గురించి ఒక సర్వే చేసింది. దీని ప్రకారం ఏ దేశంలో ఎంత సంపద ఉంటే ధనవంతులుగా పరిగణించాలో లెక్కించింది. ఈ సంస్థ సర్వే ప్రకారం మన దేశంలో రిచ్ క్లబ్బులో చేరాలంటే 1,75,000 డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.1.44 కోట్లు ఉంటేనే వాళ్లు ధనవంతులైనట్లు. ఇంతకీ మన దేశంలో ఇలాంటి ధనవంతులు ఎంత మంది ఉన్నారో తెలుసా? ఒక్క శాతం మంది. ఇండియాలో 1 శాతం మంది ధనవంతులు ఉన్నారని, వీళ్లందరినీ రిచీ రిచ్ క్లబ్బుగా పరిగణించాలని నైట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది. రూ.1.44 కోట్ల సంపద ఇండియా వరకే. ఈ సంపద కలిగి ఉంటే ఆ వ్యక్తి మాత్రమే ధనవంతుడు అవుతాడు. ఇతర దేశాల్లో ఈ క్లబ్బులో చేరాలంటే వేరే లెక్కలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఇలా అత్యంత ధనవంతులైన ఒక్క శాతం గురించిన నివేదిక ఇది.
అక్కడ మాత్రం రూ.102 కోట్లు!
మన దేశంలో ధనవంతులు కావాలంటే రూ.1.44 కోట్లు ఉంటే చాలు. అలాగని ఇతర దేశాల్లో ఈ సంపదతో కూడా ధనవంతులు అవుదామంటే కుదరదు. ఎందుకంటే అనేక దేశాల్లో రిచీ రిచ్ క్లబ్లులో చేరాలంటే ఇంతకంటే ఎక్కువ సంపద కావాలి. మొనాకోలో ధనవంతులుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే మన కరెన్సీలో రూ.102 కోట్లు కలిగి ఉండాలి. ప్రపంచంలో ధనవంతులకు సంబంధించి ఇదే అత్యధికం. మిగతా దేశాల్లో ఇంతకంటే తక్కువుంటే చాలు. స్విట్జర్లాండ్‌లో ధనవంతుడు అనిపించుకోవాలంటే రూ.54 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ.45 కోట్లు, సింగపూర్‌లో రూ.28 కోట్లు, లాటిన్ అమెరికా, బ్రెజిల్‌లో రూ.3.5 కోట్లు, అమెరికాలో రూ.42 కోట్లు, యూఏఈలో రూ.13 కోట్లు ఉంటేనే ఆయా దేశాల్లో రిచ్ క్లబ్బులో చేరుతారు. ఈ జాబితాలో ఇండియా 22వ స్థానంలో ఉంది. మన తర్వాత దక్షిణాఫ్రికా, ఫిలిప్పైన్స్, కెన్యా ఉన్నాయి. మరోవైపు కోవిడ్ వల్ల పేద, ధనిక దేశాల మధ్య అంతరం బాగా పెరిగిందని ఈ అధ్యయనం తెలిపింది.
ఇండియాలో పెరుగుతున్న బిలియనీర్లు
మన దేశంలో ఇటీవలి కాలంలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది. సగటున ఒక మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ సంపద కలిగిన వారిని బిలియనీర్లుగా పరిగణించింది. దీని ప్రకారం ఇండియాలో ప్రస్తుతం 797,714 మంది బిలియనీర్లు ఉన్నట్లు అంచనా. రాబోయే ఐదేళ్లలో వీరి సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం దీనికి కారణం.