One View Feature: ఇక అన్ని ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లను ఒకే యాప్ ద్వారా హ్యాండిల్ చేయవచ్చు.. అదేలాగో తెలుసా..?

నేటి యగంలో బ్యాంక్ అకౌంట్ అనేది అవసరం కాదు అత్యవసరంగా మారిపోయింది. ఇక ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ అయితే నిత్యవసరాల్లో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంది. ఈ మొబైల్ యాప్ ల ద్వారా కూడా యూపీఐ లావాదేవీలు జరుపుతూ ఉంటారు కొందరు. అయితే చాలా అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికోసం చాలా రకాలా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లు ఉపయోగించకుండా ఒకే యాప్ ద్వారా మీకు ఉన్న అన్నీ ప్రైవేట్ బ్యాంకు అకౌంట్లను ఆపరేట్ చేసేలా ఒకే యాప్ ను తీసుకొచ్చారు. అంటే దీని అర్థం మెనీ బ్యాంక్స్ వన్ యాప్ అనమాట.

సామాన్యుడైనా, షావుకారి అయినా తాను సంపాదించిన వాటిలో పదో పాతికో దాచిపెట్టుకోవాలనుకుంటే ఒకే ఒక మార్గం బ్యాంక్. తన నగదును ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం, జేబులో పెట్టుకుంటే ఖర్చు భయంతో బ్యాంకుల్లో నిలువ చేస్తారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో అకౌంట్ ఉంటుంది. మరి కొందరైతే ప్రభుత్వ బ్యాంకుల కన్నా ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఖాతాలు ఎక్కువగా తెరుచుకుంటున్నారు. దీనికి గల ప్రదాన కారణం తమకు పర్సనల్, హోం, కార్ లోన్లు వెంటనే అందుతాయన్న ఉద్దేశ్యం. అలాగే క్రెడిట్ కార్డులు, స్పెషల్ ఆఫర్స్ అందుతాయన్న ఆలోచనతో చాలా మంది ప్రైవేట్ బ్యాంకు ఖాతాలను తెరుచుకుంటున్నారు.

అయితే ఇప్పడు బ్యాంకింగ్ రంగంలో రోజుకో మార్పు అందుబాటులోకి వస్తుంది. ఒకప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే పాస్ బుక్ లో ఎంటర్ చేసుకునేవాళ్ళం. కొంత కాలానికి ఏటీఎం లో చూసుకునేలా మార్పు వచ్చింది. ఇప్పుడు యాప్ లోనే అకౌంట్ వివరాలతో పాటూ లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వీటికి ఆయా కంపెనీల బ్యాంకు యాప్ లను డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నాలుగు లేదా ఐదు ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లు ఉంటే వాటికి సంబంధించిన మొబైల్ యాప్ లను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం కాస్త చికాకు కలిగించినా తప్పదు మరి. అందుకే వీటికి చెక్ పెట్టేందుకు యాక్సెస్ బ్యాంక్ సరికొత్త ఫీచర్ ను యాప్ లో ప్రవేశపెట్టింది. వీటిని ఫీచర్లేంటి, ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

ఎలా ఉపయోగించాలి.?

దీనిపేరు వన్ వ్యూ ఫీచర్. ఇలా అన్ని బ్యాంకు సేవలను ఒకే యాప్ లో పొందుపరచడం అనేది ఇదే మొదటి సారి. దీనిని కేవలం యాక్సెస్ బ్యాంక్ ఖాతాదారులే కాకుండా మిగిలిన బ్యాంక్ కస్టమర్లు తమ ఖాతాలను ఈ యాప్ తో అనుసంధానం చేయవచ్చు. అయితే యాక్సెస్ బ్యాంక్ ఖాతా అయితే తప్పనిసరిగా ఉండాలి. దీని ద్వారానే మిగిలిన వాటిని లింక్ చేసుకోగలరు. దీనిని ఉపయోగించి అన్ని రకాలా బ్యాంక్ స్టేట్మెంట్లు, బ్యాలెన్స్ వివరాలు, నగదు బదిలీలు ఇలా అన్ని రకాలా లావాదేవీలను జరుపవచ్చని యాక్సెస్ బ్యాంక్ ప్రెసిడెంట్ సమీర్ శెట్టి పేర్కొన్నారు.

దీనిని అకౌంట్ అగ్రి గేటర్ విధానాన్ని ఉపయోగించి ఈ సరికొత్త బ్యాంకిగ్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దీనివల్ల అనేక రకాల బ్యాంక్ యాప్ లను ఉపయోగించే అవసరాన్ని కొంతమేర నియంత్రించవచ్చు. ఈ ఒక్క బ్యాంకు యాప్ లోని వన్ వ్యూ ఫీచర్ తో లింక్ అయితే అన్ని బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చాని వివరించారు. మనకు అవసరం లేని బ్యాంకును యాప్ లోని లింక్ నుంచి తొలగించుకోవచ్చు. మరో కొత్త బ్యాంకును నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈ విధానం వినేందుకు బాగానే ఉన్నా ఆచరణలోకి వచ్చి కొన్ని రోజులు గడిచాక కస్టమర్ల ఫీడ్ బ్యాక్ ఎలా ఉందో అన్నదానిబట్టే ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది.

 

T.V.SRIKAR