Smart Phone Prices: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు షాక్ తగలనుంది. త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. దీనికి బడ్జెట్ కారణం కాదు. స్మార్ట్‌ఫోన్లలో వినియోగించే మెమరీ చిప్ ధరలు పెరగడమే ఇందుకు కారణం. అలాగే ఈ చిప్‌లు తయారు చేసే చైనీస్ యువాన్ బలపడటం కూడా ఫోన్ల ధరలు పెరిగేందుకు కారణమవ్వొచ్చు. ఫోన్లలో చిప్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి చైనా, తైవాన్ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే దొరుకుతాయి. అందువల్ల వీటికి డిమాండ్ ఎక్కువ.
Smita Sabharwal: స్మితకు కష్టాలే! స్మిత సబర్వాల్ మెడకు.. భగీరథ పైపుల స్కామ్
ఎంత ధరైనా చెల్లించి కొనుగోలు చేయాల్సిందే. అక్కడ వీటి ధరలు 15 నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ చిప్స్ సరఫరా తగ్గిపోవడం కారణంగా ధరలు పెరుగుతున్నాయి. ఎక్కువ ఇన్వెంటరీ ఉన్న ఉత్పత్తుల కాంట్రాక్ట్ ధర 3-8 శాతం మాత్రమే పెరుగుతుందని ట్రెండ్‌ఫోర్స్ సంస్థ నివేదికలో పేర్కొంది. దీనికి విరుద్ధంగా, కొరత ఉన్న ఉత్పత్తుల కాంట్రాక్ట్ ధర మాత్రం ఐదు నుంచి పది శాతం మాత్రమే పెరుగుతుందని అంచనా. ఫిబ్రవరి మూడవ వారం నుంచి మార్చి మొదటి వారం వరకు అధిక డిమాండ్ కారణంగా, మెమరీ ధరలు 10-15 శాతం పెరిగే అవకాశం ఉంది. దీంతో జూన్ నుంచి ఫోన్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే, ప్రతి కంపెనీ తమ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచాల్సి ఉంటుంది. చైనీస్ కరెన్సీ యువాన్ బలపడటంతో మొబైల్ ఫోన్ విడిభాగాలు కూడా ఖరీదైనవిగా మారాయి. అధిక ధర చెల్లించి, చైనా నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అయితే, ఇటీవలి బడ్జెట్‌లో కేంద్రం దిగుమతి సుంకాలను తగ్గించిన నేపథ్యంలో ధరల పెరుగుదల అంతగా ఉండకపోవచ్చు. మన దేశంలో విక్రయమవుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు చైనీస్ భాగాలపై ఆధారపడి తయారవుతాయి.
ఆ విడిభాగాలను తెచ్చుకునేందుకు చైనా యువాన్ కరెన్సీలో లావాదేవీలు జరపాలి. యువాన్ జూన్ 2023లో రూ. 11.32 కనిష్ట స్థాయి నుంచి డిసెంబర్‌లో రూ. 12.08కి పెరిగింది. అంటూ 6.7 శాతం పెరిగింది. ఈ ప్రభావం చైనీస్ విడి భాగాలను దిగుమతి చేసుకునే బ్రాండ్‌లపై పడుతుంది. కానీ ఇటీవలి డ్యూటీ తగ్గింపు, పెరుగుతున్న మారకపు రేట్ల రెట్టింపు దెబ్బ నుంచి మెమరీ చిప్‌ల ధరలను కాపాడుతుందని అంచనా. అందువల్ల, హ్యాండ్‌సెట్ ధరలను పెంచే బదులు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో తక్కువ మెమరీ అలాగే స్టోరేజీని అందించడం బ్రాండ్‌లకు ఒక మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు.