Apple i Phone: ఐఫోన్ 15 సిరీస్ కి ఆదిలోనే హంసపాదం.. కారణాలు ఇవే

ఐఫోన్ దీని వాడకం విచిత్రంగా ఉన్నా బ్రాండింగ్ లో మాత్రం రారాజు అనే చెప్పాలి. దీనికి కారణం దాని క్వాలిటీ మొదలు పనితీరు వరకూ అన్ని అద్భుతంగా ఉంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలాగా హ్యంగ్ అవడం, హ్యాకింగ్ కి గురికావండం వంటి సమస్యలు ఐఫోన్లో ఉండవు. అందుకే అందరూ దీనిని కొనేందుకు ఇష్టపడతారు.

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 12:14 PM IST

తాజాగా మార్కెట్లోకి మరో ఐఫోన్ రానుంది. మరో వారం, పది రోజుల్లో ఐఫోన్ 15 సిరీస్ ను విడుదల చేసేందుకు యాపిల్ సంస్థ సిద్దమైంది. ఈ తరుణంలో దీనిపై సామాజిక మాధ్యమాల్లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మరో నివేదిక కూడా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఐఫోన్ 15 మోడల్ ఉత్పత్తి బాగా తగ్గిందని ఈ నివేదిక సారాంశం. దీనికి గల కారణాలను కూడా వివరించింది. దీంతో యాపిల్ సంస్థకు తమ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేయకముందే దీని ప్రభావం అమ్మకాలపై పడే ప్రభావం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అసలే ఐఫోన్ అంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సరదాకి కూడా ఫోన్లు మారుస్తూ ఉంటారు. వీరందరి చెవులకు ఈ వార్త చేరితే తమకు ఎక్కడ దొరకదో అన్న భావన కలుగుతుంది. దీంతో ప్రస్తుతం వచ్చే మోడల్ ని కొనకుండా మరో మోడల్ కోసం ఎదురు చూస్తారని చెబుతున్నారు విశ్లేషకులు.

9 టు 5 రిపోర్ట్ వివరాల ప్రకారం..

ఇటీవల ప్రముఖ హాంకాంగ్ ఇన్వస్ట్మెంట్ ఆర్గనైజేషన్ హౌటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ టెక్ విశ్లేషకుడు జెఫ్ పు ఐఫోన్15 గురించి కీలక విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఐఫోన్ 15 ఎన్ని యూనిట్లు తయారవుతాయో అంచనా వేశారు. గతంలో 83 మిలియన్ యూనిట్లు వస్తాయని చెప్పగా తాజాగా 77 మిలియన్ యూనిట్లు మాత్రమే వస్తాయని తెలిపారు. దీనికి కారణాలను కూడా వివరించారు. ఐఫోన్ కి తయారీకి అవసరమైన ఎలక్ట్రానిక్ విడి భాగాలు యాపిల్ సంస్థకి సకాలంలో అందడం లేదని తెలిపారు. దీని కారణంగా ఆ ప్రభావం వస్తు ఉత్పత్తి మీద పడి తక్కువ ఫోన్లు మార్కెట్లోకి వస్తాయని అంచనా వేశారు. అలాగే కొన్న తరువాత ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని రిపేర్ చేయించుకునేందుకు స్పేర్స్ సకాలంలో అందవు. అందుకే ఐఫోన్ 15 ను కొనుగోలు చేసేందుకు సుముఖత చూపించడం లేదని భవిష్యత్తును ఊహించారు.

జపనీస్ బ్యాంకు రిపోర్ట్ ఇలా..

జెఫ పు చెప్పిన దానిని పరిశీలించిన మిజుహో అనే జపనీస్ బ్యాంక్ ఓ రిపోర్ట్ ను వెల్లడించింది. ఐఫోన్ 15 ఎన్ని ఉత్పత్తి అవుతాయో ఇందులో పేర్కొంది. గతంలో 84 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి అవుతుందని భావిస్తే కేవలం 77 మిలియన్లు మాత్రమే ఉత్పత్తి అయింది. దీనికి కారణం ఐఫోన్ 15 తయారీకి అవసరమైన ముడి భాగాలు అందుబాటులో లేవని స్వయంగా యాపిల్ సంస్థకు చెందిన కొందరు గతంలో తెలిపింనట్లు నివేదికలో పొందుపరిచారు.

ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రో సంగతేంటి..

ఐఫోన్ 15 కి సంబంధించే చాలా రకాల వార్తలు షికారు చేస్తున్న క్రమంలో ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రో గురించి ఆసక్తికరమైన అప్డేడ్ బయటకు వచ్చింది. ఐఫోన్ 15 కి.. ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రోకి మధ్య తేడా ఒక్క కెమెరా క్లారిటీ ఫీచర్ మాత్రమే అని తేలింది. ప్రో మ్యాక్స్ లో ఫోటోలు మరింత దగ్గరగా జూమ్ చేసేందుకు వీలుంటుంది. పైగా ఎంత జూమ్ చేసినా క్లారిటీ మాత్రం మిస్ అవ్వదు. అయితే ఈ మ్యాక్స్ ప్రోకి కూడా కొన్ని ఉత్పత్తి పరమైన సమస్యలు ఉన్నట్లు చెబుతున్నారు పారిశ్రామిక నిపుణులు. లేటెస్ట్ టెక్నాలజీ కెమెరాతో రూపొందిస్తున్న ఈ ఐఫోనుకు సోనీ సంస్థ కెమెరా విడిబాగాలను సప్లే చేస్తోంది. ఈ సప్లేలో తీవ్ర జాప్యం జరుగుతున్నందున ఫాన్సీ ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రో మరింత ఆలస్యంగా మార్కెట్లోకి వస్తుందని చెబుతున్నారు టెక్ నిపుణులు. బహుషా అక్టోబర్ చివరి నాటికి వచ్చేలా యాపిల్ సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తుంది.

T.V.SRIKAR