Twitter Blue Tick: పొలిటీషియన్స్‌కు షాకిచ్చిన ఎలాన్‌ మస్క్‌.. ట్విటర్‌లో ఆ సర్వీస్‌ కట్‌..

తమిళనాడు సీఎం స్టాలిన్‌, తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, మినిస్టర్‌ ఉదయనిధి స్టాలిన్‌, హీరో విజయ్‌ సహా చాలా మంది ట్విటర్‌లో బ్లూటిక్‌ కోల్పోయారు. ఇక మన దగ్గర ఏపీ సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కొహ్లీ, రోహిత్‌ శర్మ, అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌లకు బ్లూ టిక్‌ తొలగించాడు.

  • Written By:
  • Publish Date - April 21, 2023 / 11:48 AM IST

Twitter Blue Tick: రాజకీయ, సినీ ప్రముఖులకు ట్విటర్‌ ఓనర్‌ ఎలాన్‌ మస్క్‌ షాకిచ్చాడు. ముందు నుంచీ చెప్తున్నట్టుగానే చాలా మంది సెలబ్రెటీస్‌, పొలిటీషియన్స్‌కు బ్లూ టిక్‌ రిమూవ్‌ చేశాడు. తమిళనాడు సీఎం స్టాలిన్‌, తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, మినిస్టర్‌ ఉదయనిధి స్టాలిన్‌, హీరో విజయ్‌ సహా చాలా మంది ట్విటర్‌లో బ్లూటిక్‌ కోల్పోయారు. ఇక మన దగ్గర ఏపీ సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కొహ్లీ, రోహిత్‌ శర్మ, అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌లకు బ్లూ టిక్‌ తొలగించాడు.

ట్విటర్‌ ఎలాన్‌ మస్క్‌ చేతికి వచ్చిన తరువాత సంస్థలో చాలా మార్పులు చేశాడు మస్క్‌. ఉద్యోగుల దగ్గర్నించి ట్విటర్‌ లోగో వరకూ చాలా విషయాల్లో చేంజెస్‌ చేశాడు. ఒకప్పుడు బ్లూ టిక్‌ను పొందేందుకు ఎకౌంట్‌ వెరిఫై చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పద్ధతిని పక్కన పెట్టి సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని తీసుకువచ్చాడు మస్క్‌. ఈ ప్రాసెస్‌తో ట్విటర్‌కు ఇన్‌కం కూడా బాగా పెరుగుతుందనేది మస్క్‌ ప్లాన్‌. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ మొబైల్ యూజర్లు బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. అదే వెబ్ యూజర్లు నెలకు రూ.650 చెల్లించాలి.

ఇయర్లీ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వెబ్‌ యూజర్లకు డిస్కౌంట్ లభిస్తుంది. వీళ్లు ఇయర్‌కి రూ.7,800 బదులుగా.. రూ.6,800 చెల్లిస్తే సరిపోతుంది. ఇయర్లీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను ఇంకా మొబైల్‌ యూజర్లకు అందుబాటులో లేదు. ప్రజెంట్‌ సినీ, రాజకీయ ప్రముఖులు బ్లూ టిక్‌ కోల్పోవడానికి కారణం ఇదే. ముందు నుంచి వెరిఫైడ్‌ ఎకౌంట్‌గా ఉండటంతో వీళ్లంతా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోలేదు. దీంతో ఇప్పుడు బ్లూటిక్‌ తొలగించింది ట్విటర్‌. ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు లాంటి కొంత మంది హీరోలు, పొలిటీషియన్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడంతో వాళ్ల బ్లూ టిక్‌ అలాగే కంటిన్యూ అవుతోంది.