WhatsApp: మీ వాట్సాప్‌ హ్యాక్‌ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోండి..

ఈ మధ్య హ్యాకింగ్‌ థింగ్స్‌ కూడా చాలా ఈజీ ఐపోయాయి. చిన్న లింక్‌ క్లిక్ చేస్తే చాలు మన డేటా మొత్తం హ్యాకర్‌ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి డేంజరస్‌ సిచ్యువేషన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాట్సాప్‌ వెబ్‌ యూజర్స్‌ చాలా జాగ్రత్తగా ఉండటం బెటర్‌.

  • Written By:
  • Publish Date - July 19, 2023 / 11:31 AM IST

WhatsApp: సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం కావొచ్చు, మెసేజింగ్‌ యాప్‌ కావొచ్చు. ఇంటర్నెట్‌ అనగానే ఏదో ఒక తెలియని అన్‌ సెక్యూర్‌ ఫీలింగ్‌ చాలా మందిలో ఉంటుంది. నిజానికి అది నిజమే. ఇంటర్నెట్‌లో మన డేటా అంత సేఫ్‌ కాదు. చాలా వరకు మన పర్సనల్‌ విషయాలు సోషల్‌ మీడియాలో పెట్టకపోవడమే మంచిది. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మెసేజింగ్‌ యాప్‌ విషయానికి వస్తే ఎక్కువ మంది యూజర్లు వాడేది వాట్సాప్‌. ఎప్పటికప్పు కొత్త అప్‌డేట్స్‌తో యూజర్ల ముందుకు వచ్చే వాట్సాప్‌ ఇప్పడు మరిన్ని అప్‌డేట్స్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

త్వరలోనే ఆ అప్‌డేటెడ్ వెర్షన్‌ రిలీజ్‌ కాబోతుంది. వెర్షన్‌ ఏదైనా వాట్సాప్‌ సేఫా కాదా అనేది ప్రతీ ఒక్కరూ చూసుకోవాల్సిన విషయం. ఈ మధ్య హ్యాకింగ్‌ థింగ్స్‌ కూడా చాలా ఈజీ ఐపోయాయి. చిన్న లింక్‌ క్లిక్ చేస్తే చాలు మన డేటా మొత్తం హ్యాకర్‌ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి డేంజరస్‌ సిచ్యువేషన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాట్సాప్‌ వెబ్‌ యూజర్స్‌ చాలా జాగ్రత్తగా ఉండటం బెటర్‌. మన మెసేజెస్‌ మనం కాకుండా ఎవరైనా చదువుతున్నారా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు యూజర్లు చెక్‌చేస్తూ ఉండాలి. ఇందుకోసం థర్డ్‌ పార్టీ యాప్స్‌ ఏమీ అవసరం లేదు. మీ వాట్సాప్‌ ఓపెన్‌ చేస్తే పైన కనిపించే త్రీ డాట్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే లిస్ట్‌లో లింక్‌ డివైజ్‌ అని వస్తుంది.

దాని మీద క్లిక్‌ చేస్తే మీ వాట్సాప్‌ అకౌంట్‌ ఎన్ని డివైజ్‌లలో లాగిన్‌ అయ్యి ఉందో తెలుస్తుంది. మీరు వాట్సాప్‌ వెబ్‌ వాడుకునే డివైజ్‌ కాకుండా వేరే డివైజ్‌ పేరు చూపిస్తే మీ వాట్సాప్‌ మెసేజెస్‌ ఎవరో చూస్తున్నట్టే లెక్క. వెంటనే అలాంటి డివైజ్‌ నుంచి లాగౌట్ అవ్వడం బెటర్‌.