whats App: వాట్సప్ స్టిక్కర్లను మనమే తయారు చేసుకునేలా సరికొత్త ఫీచర్.. అందుబాటులోకి ఎప్పుడంటే..

వాట్సప్ లో పంపించే సందేశాత్మక స్టిక్కర్లను మనమే సొంతంగా తయారు చేసుకునేలా మెటా సంస్థ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

  • Written By:
  • Publish Date - August 16, 2023 / 07:34 AM IST

ప్రముఖ పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తనను తాను దినదినాభివృద్ది చేసుకుంటూ ముందుకు సాగుతోంది. మన్నటి వరకూ వీడియో కాలింగ్ ద్వారా స్క్రీన్ షేరింగ్ సౌకర్యంతో పాటూ సింగల్ అకౌంట్ డ్యూయల్ వాట్సప్ ను తీసుకొచ్చింది. అయితే తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అనుసంధానం చేస్తూ మనకు కావల్సిన స్టిక్కర్లను రూపొందించుకునేలా డెవలప్ చేసింది.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ వర్షన్ కు సంబంధించిన బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో అన్ని వర్షన్లకు దీని విస్తృతిని పెంచే అవకాశం ఉన్నట్లు వాబీటా ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇలా మనకు కావల్సిన స్టిక్కర్లను తయారు చేసుకోవాలంటే దానికి కావల్సిన కమాండ్స్ ని మనం అందించాల్సి ఉంటుంది. దీనిని క్యాట్ వేరింగ్ హ్యాట్, డాగ్ ఆన్ స్కేట్ బోర్డ్ కంమాండ్లుగా పేరు పెట్టారు. వీటి సహాయంతోనే మనకు కావల్సిన విధంగా స్టిక్కర్ తయారవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ చివరిదశలో తుదిమెరుగులు దిద్దుకుంటుంది. త్వరలో అన్ని ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ వెసులుబాటు అందుబాటులోకి రానుంది.

మనం స్టిక్కర్లను సందర్బాన్ని బట్టి ఒక్కో హావభావాలను పంపిస్తూ ఉంటాం. ఈ ఎఐ ద్వారా రూపొందిన స్టిక్కర్ ఎదుటి వారికి పంపిస్తే అతి సులువుగా అర్థమయ్యేలా ఉంటుంది. వాట్సప్ లోని స్టిక్కర్ ప్యాలెట్ లో ఈ సరికొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఇలా తయారుచేసేందుకు ఏ టెక్నాలజీని ఉపయోగించిందో మెటా సంస్థ వెలువరించలేదు.

T.V.SRIKAR