కోల్‌కతా ఆర్జీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఉదంతం.. దేశం మొత్తాన్ని ఆవేదనకు గురిచేస్తోంది. ఈ ఘటనను సుమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. విచారణ చేపట్టనుంది. హత్యాచార ఘటనకు సంబంధించి.. రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. డాక్టర్‌ను కావాలని కొందరు టార్గెట్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయ్. రెస్ట్ లేకుండా.. వరుస పెట్టి షిఫ్ట్‌లు వేసి.. ఆమెను ఇబ్బంది పెట్టారని డాక్టర్లు చెప్తున్నారు. ఐతే ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వృత్తిని మాత్రం ఆమె ఎంతో గౌరవించేది. ఐతే ఈ ఘటనకు సంబంధించి సంజయ్ రాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాలిగ్రఫీ టెస్టులు.. అంటే నిజ నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతున్నారు. కోర్టు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే ఇదంతా ఎలా ఉన్నా.. ఈ కేసులో సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయ్. డాక్టర్ రేప్ అండ్ మర్డర్ అనడానికి పక్కాగా ఆధారాలు కనిపిస్తున్నా.. ఆమెది సూసైడ్ అని వెంటనే నిర్దారించేశారు. ఎవరో కావాలని చెప్పించినట్లు! నిజంగా ఎవరైనా ఉన్నారా.. ప్రిన్సిపాల్ హస్తం ఉందా అనే అనుమానాలు మొదలయింది ఇక్కడే. ఇక రెండో ప్రశ్న.. డాక్టర్ చనిపోయిన మూడు గంటల తర్వాత ఆమె తల్లిదండ్రులకు ఎందుకు సమాచారం అందించారు.
వాళ్లు ఆసుపత్రి చేరుకున్న మూడు గంటల తర్వాత.. ఎందుకు శవం దగ్గరికి పంపించారు. ఈ ఆరు గంటల్లో ఏం జరిగింది అన్నది మరో ప్రధాన ప్రశ్న. ఇక మూడో ప్రశ్న.. అసలు చనిపోయిన డాక్టర్ మానసిక పరిస్థితి బాలేదని.. సైకోసిస్ వ్యాధితో బాధపడుతుందని.. ప్రిన్సిపాల్ ఎందుకు చెప్పారు.. ఇది ఆయన మాటేనా.. అతనితో ఎవరైనా పలికించారా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇక నాలుగో ప్రశ్న.. తెల్లవారుజామున నాలుగున్నరకు సంజయ్ రాయ్‌ను ఆసుపత్రిలోకి అనుమతించింది ఎవరు.. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు దేశమంతా డిమాండ్ చేస్తోంది. ఇక ఐదో ప్రశ్న.. ఆసుపత్రి మొత్తం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయ్.
మరి క్రైమ్ జరిగిన ప్రాంతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఎక్కడ.. రికార్డు కాలేదా.. దాచిపెట్టారా.. లేదంటే రికార్డ్ అయ్యాక డిలీట్ చేశారా.. ఏం జరిగింది అన్నది మరో ప్రశ్న. ఇక ఆరో ప్రశ్న.. క్రైమ్ జరిగిన ప్రాంతాన్ని ఎందుకు సీల్ చేయలేదు. ఎందుకు అలా వదిలేశారు. సీల్ చేసి ఉంటే.. మరిన్ని ఆధారాలు దొరికి ఉండేవి కదా.. ఎందుకు అలా చేయలేదు. ఇక ఏడో ప్రశ్న.. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న సంజయ్ రాయ్ అనే కామాంధుడు.. పోలీసు వాలంటీర్ ఎలా అయ్యాడు.. ఆ మాత్రం బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయకుండా ఎలా వదిలేశారు. వీటికి తోడు అసలు ఆ రోజు రాత్రి చనిపోయిన డాక్టర్‌తో పాటు డ్యూటీలో ఉన్నది ఎవరు.. అసలు ఆసుపత్రికి డ్రగ్స్‌కు సంబంధాలపై ఎందుకు చర్చ జరుగుతోంది. అవి తెలిసిందనే డాక్టర్‌ను చంపేశారా.. ఈ వెనక ఎవరు ఉన్నారు.. ఇలా రకరకాల ప్రశ్నలు డాక్టర్ హత్యాచార ఘటన చుట్టూ తిరుగుతున్నాయ్.