Cheating @Raydurgam : రాయదుర్గంలో ఘరానా మోసం.. 100 కోట్ల కంపెనీ కొట్టేసిన కేటుగాళ్ళు !

వంద కోట్ల విలువైన కంపెనీని అప్పనంగా కొట్టేశారు ఇద్దరు కేటుగాళ్ళు. కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు... యజమాని అమెరికా వెళ్ళడంతో అతని డిజిటల్ సైన్ తో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు.

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 06:29 PM IST

ఫోర్జరీ సంతకాలతో.. 100 కోట్ల రూపాయల విలువైన కంపెనీని తమ పేరు మీద రాసుకున్నారు కేటుగాళ్లు. రాత్రికి రాత్రే కంపెనీని కొట్టేశారు స్వామీజీ కాకర్ల, రవికుమార్ దాపర్తి. వీళ్ళపై హైదారాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు బాధితుడు వెంకట్ కొల్లి. వ్యాపార పనుల నిమిత్తం అమెరికా వెళ్ళారు orwin ల్యాబ్స్ యజమాని వెంకట్ కొల్లి. 6 నెలల తర్వాత తిరిగి వచ్చారు. ఈ ఆరు నెలల్లో orwin ల్యాబ్స్ ని తమ పేరు మీద రాసుకున్నారు స్వామీజీ కాకర్ల, రవికుమార్ ధాపర్తి. వెంకట్ కొల్లి డిజిటల్ సంతకాలు ఫోర్జరీ చేసి.. కంపెనీ డైరెక్టర్లుగా మారారు వీళ్ళిద్దరూ. కంపెనీకి చెందిన కోట్ల రూపాయలను దారి మళ్లించారు.  నిందితుడు స్వామీజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మరో కేటుగాడు రవికుమార్ పోలీసుల అదుపులో ఉన్నారు.  US కి వీసాలు ఇప్పిస్తామని విద్యార్థుల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నట్లు స్వామీజీ, రవికుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం Orwin ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్  పేరుతో కంపెనీని ప్రారంభించారు రఘుకుమారి కొల్లి, లక్ష్మణ్ రావు యడ్లపాటి. కంపెనీ డైరెక్టర్ గా రఘు కుమారి కొడుకు వెంకట్ కొల్లి నియమితులయ్యారు.  ఆ తర్వాత ఆయన అమెరికాకి వెళ్ళొచ్చేసరికి స్వామీజీ, రవి కుమార్ ఆక్రమించినట్టు పోలీసులు తెలిపారు.